Side Effects of Eating Fruits with Salt: పండ్లు అన్ని కాలాల్లోను శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రస్తుతం చాలా మంది పండ్లను కోసి ఉప్పు, మసాలాలు వేసి తినడానికి ఇష్టపడతారు. ఇలా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఉప్పు, చాట్ మసాలాలో ఉండే సోడియం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇలా ప్రతి రోజు పండ్లను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల శరీరంలో పోషకాలు కూడా తగ్గుతాయి.
పండ్లపై ఉప్పు, చాట్ మసాలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
శరీరంలో పోషకాలు పరిమాణాలు తగ్గుతాయి:
పండ్లలో ఉప్పు, మసాలాలు వేసుకుని తీసుకోవడం వల్ల నోటికి రుచిని అందించిన తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పండ్లలో ఖనిజాలు కూడా తగ్గుతాయి. దీని కారణంగా శరీరంలో పోషకాల కోరత తగ్గుతుంది.
Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..
శరీర బరువును పెంచుతుంది:
పండ్లలో సహజంగా గ్లూకోజ్ పరిమాణాలు అధికంగా లభిస్తాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. వేసవి కాలంలో చాలా మంది మామిడి పండ్లలో పంచదార వేసుకుని తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీర బరువు కూడా పెరుగుతారు.
మూత్రపిండాలపై ప్రభావం:
పండ్లపై ఉప్పు లేదా చక్కెర వేసుకుని తినడం వల్ల మూత్రపిండాలపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల మూత్రంలో సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చర్మంపై వాపు:
పండ్లపై ఉప్పు చల్లుకుని తింటే చర్మంపై వాపు ఇతర సమస్యలు వస్తాయి. ఉప్పులో ఉండే సోడియం కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి పండ్లపై ఉప్పు, చక్కెర చల్లుకుని తినడం తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి