Body Cleanser: స్కిన్ కేర్ అంటే కేవలం కేవలం ఫేస్ కేర్ ఒక్కటే కాదు..టోటల్ బాడీ కేర్ తీసుకోవాలి. చర్మ సంరక్షణకు చర్యలు తీసుకుంటూ చేతులు, కాళ్లను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల నలుగురిలో తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఈ పరిస్థితి నుంచి విముక్తి పొందేందుకు బాడీ క్లీన్సర్ చాలా అవసరం.
ముఖ సౌందర్యంతో పాటు పుల్ బాడీ కేర్ కోసం చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్ లో లభించే ఉత్పత్తులతో దుష్పరిణామాలు ఎదురౌతుంటాయి. బాడీ క్లీన్సర్ తయారు చేసేందుకు కొబ్బరినూనె, పిండి, శెనగపిండి, కాఫీ, నిమ్మకాయ పెరుగు అవసరమౌతాయి. ఈ పదార్ధాలతో ముఖ సౌందర్యం ఒక్కటే కాకుండా శరీరంలో పేరుకునే వ్యర్ధాలు కూడా తొలగిపోతాయి. డెడ్ స్కిన్ కూడా పోతుంది. చర్మానికి నిగారింపు కొత్తగా వచ్చి చేరుతుంది. దాంతోపాటు చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది.
బాడీ క్లీన్సర్ చేసేందుకు కొబ్బరి నూనె 1 స్పూన్, పిండి ఒక స్పూన్, 1 స్పూన్ శెనగపిండి, కాఫీ 1 స్పూన్, నిమ్మకాయ అర స్పూన్, పెరుగు 2 స్పూన్స్ అవసరమౌతాయి. బాడీ క్లీన్సర్ తయారు చేసేందుకు ఇందులో 1 స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ కాఫీ పౌడర్ కలపాలి. ఆ తరువాత ఇందులో ఒక్కొక్క స్పూన్ పిండి, శెనగపిండి కలపాలి. ఆ తరువాత ఇందులో నిమ్మరసం, 2 స్పూన్స్ పెరుగు కలపాలి. అన్నింటినీ బాగా కలపాలి. మీక్కావల్సిన హోమ్ మేడ్ బాడీ క్లీన్సర్ తయారైనట్టే.
బాడీ క్లీన్సర్‌ను చేతులు, కాళ్లకు రాసుకోవాలి. కనీసం 15-20 నిమిషాలుంచాలి. ఆ తరువాత చేతులతో మస్సాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై డెడ్ స్కిన్ నెమ్మదిగా తొలగిపోతుంది. చర్మం నిగనిగలాడుతుంది. ట్యానింగ్ సమస్యకు కూడా ఇది అద్బుతంగా పనిచేస్తుంది.
Also read: Dry Cough Remedies: ఈ రెండు వస్తువులు వాడితే చాలు పొడిదగ్గు చిటికెలో మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook