Skin Care Tips: ఆ చిన్న చిన్న పొరపాట్లే కొంప ముంచుతాయి, అంద వికారంగా మారతారు జాగ్రత్త

Skin Care Tips: అందం సగం ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో..అందాన్ని సంరక్షించుకోవడం చాలా అంతే ముఖ్యం. మరి చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యానికి ఏం చేయాలనేది తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 20, 2022, 06:20 PM IST
Skin Care Tips: ఆ చిన్న చిన్న పొరపాట్లే కొంప ముంచుతాయి, అంద వికారంగా మారతారు జాగ్రత్త

నిత్యం చేసే కొన్ని కొన్ని పొరపాట్ల కారణంగా ముఖంపై పింపుల్స్, ఏర్పడి అందవికారంగా తయారవుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలి.

సీజన్ ఏదైనా సరే చర్మ సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. లేకపోతే ముఖం అందం దెబ్బతింటుంది. కానీ చాలాసార్లు కేర్ తీసుకున్నా సరే..పింపుల్స్ సమస్య వెంటాడుతుంటుంది. అంటే ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నట్టు అర్ధం. ఫలితంగా పింపుల్స్ సమస్య తలెత్తుతుంది. ఎలాంటి పొరపాట్లు చేస్తున్నామో పరిశీలిద్దాం.

స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో తేడా

స్కిన్ కేర్ కోసం మార్కెట్‌లో లభించే వస్తువుల్లో ఏవి పడితే అవి వినియోగించకూడదు. ముందుగా మీ స్కీన్ గుణం ఎలాంటిదో తెలుసుకోవాలి. అంటే డ్రై లేదా ఆయిలీ లేదా నార్మల్ ఎలాంటిదో పరిశీలించుకోవాలి.  మీ చర్మ గుణాన్ని బట్టి కాకుండా వేరే స్కిన్ కేర్ ఉత్పత్తులు వినియోగిస్తే..చర్మానికి హాని కలుగుతుంది. పింపుల్స్ సమస్య పెరిగిపోతుంది.

హాని కల్గించే మేకప్ ఉత్పత్తులు

అందానికి మెరుగులు దిద్దేందుకు మేకప్ చేస్తుంటారు. కానీ మేకప్ చేసే ఉత్పత్తుల్లో కెమికల్స్ అధికంగా ఉండటం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. మేకప్ ఎక్కువసేపు ఉంచడం వల్ల ముఖానికి ఆక్సిజన్ అందక..పింపుల్స్ సమస్య ఏర్పడుతుంది.

క్లీన్సర్ సరిగ్గా లేకపోవడం

ముఖానికి రాసుకునే క్లీన్సర్ ఎంపిక చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఫేసియల్ స్కిన్‌కు హాని కలుగుతుంది. ఫోమ్ క్లీన్సర్‌ను ఎప్పుడూ వినియోగించకూడదు. దాంతోపాటు స్కిన్ ఎక్సెఫోలియేట్ కోసం క్లీన్సర్ ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల స్కిన్ బ్రేకవుట్ అవుతుంది. క్లీన్సర్ ఎప్పుడూ వాటర్ బేస్డ్ అయుండాలి

మేకప్ తొలగించేందుకు వైప్స్ ఒక్కటే కాకుండా..ఫేస్‌వాష్ ఉత్పత్తుల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ముఖానికి అంటుకునే కెమికల్స్ పూర్తిగా తొలగిపోతాయి. సాధ్యమైనంతవరకూ దుమ్ము ధూళి, ఎండకు దూరంగా ఉండాలి. చలికాలంలో అయితే లోషన్ తప్పకుండా వాడాలి. 

Also read: Weight Loss leaves: రోజూ ఆ ఆకులు నమిలి తింటే..నెలరోజుల్లో బరువు తగ్గడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News