Hair Loss Foods: ఈ ఆహార పదార్థాలు తీసుకుంటున్నారా.. జుట్టు రాలడానికి కారణం ఇవే!

Top 5 Foods Cause Hair Loss: ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టును కోరుకుంటారు. జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి మార్కెట్‌లో లభించే  ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. కానీ దీని వల్ల జుట్టు సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.  దీంతో పాటు మీనం తీసుకునే ఆహార వల్ల కూడా జుట్టుకు హాని కలిగించవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2024, 04:09 PM IST
Hair Loss Foods: ఈ ఆహార పదార్థాలు తీసుకుంటున్నారా.. జుట్టు రాలడానికి  కారణం ఇవే!

Top 5 Foods Cause Hair Loss: నేటి కాలంలో అధిక ఒత్తిడి, కాలుష్యం వల్ల జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా మనం తీసుకొనే ఆహారం వల్ల కూడా జుట్టుకు హాని కలిగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  సరైన ఆహారం తీసుకుపోవడం వల్ల జుట్టు రాడాన్ని వేగవంతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. వీటిని మీరు తీసుకోవడం  మంచిది కాదు.

చక్కెర:

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా శరీరానికి మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల  మధుమేహం, ఊబకాయాం వంటి సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. ఈ సమస్యల కారణంగా  జుట్టును కోల్పోయేలా చేస్తాయి.

మద్యం:

జుట్టు కెరాటిన్ అనే ప్రొటీన్‌తో తయారువుతుంది. దీని వల్ల జుట్టు పెరుగుతుంది. కానీ ఎక్కువగా ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల ఈ పోషకాలు తగ్గుతాయి. జుట్టు రాలే సమస్య మొదలవుతుంది.

డైట్ సోడా:

డైట్‌ సోడాల్లో ఆర్టిఫిషియల్ స్వీటెనర్‌ ఉంటుంది. దీని వల్ల శరీరానికి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ఈ డైట్ సోడాను పూర్తిగా మానేయడం చాలా మంచిదని చెబుతున్నారు.

జంక్ ఫుడ్:

జంక్‌ ఫుడ్స్‌ను ఎంతో ఇష్టంగా తింటారు చాలా మంది. వీటిలో  మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల కూడా జుట్టు రాలడానికి కారణమవుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

పచ్చి గుడ్డులోని తెల్లసొన:

పచ్చి గుడ్డులోని తెల్లసొనలో కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడే బయోటిన్ అనే విటమిన్ లోపం ఉంటుంది. దీని వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది.

Also Read Papaya Empty Stomach: బొప్పాయి పరగడుపున తింటే ఏం అవుతుందో తెలుసా? మీకు ఆశ్చర్యం కలిగించే విషయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News