Tips To Stop Hair Fall In Winters: చలి కాలంలో చాలా మంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. అంతేకాకుండా చలి కాలంలో కొన్ని చేయ్యకూడని తప్పల వల్ల జుట్టు దెబ్బతింటోంది. కాబట్టి ఈ సమయంలో జుట్టును సంరక్షించుకోవడం చాలా మంచిది. లేకపోతే జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాతావరణంలోని తేమ పెరగడం కారణంగా చాలా మందిలో శరీరంపైనే ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా జుట్టుపై కూడా ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
జుట్టుకు నూనె రాసుకోకపోవడం:
ప్రస్తుతం చాలా మంది వింటర్ సమయంలో జుట్టుకు నూనె రాసుకోవడం మానుకుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టులోని కూడా తెమ తగ్గిపోయి అనేక రకాల జుట్టు సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వింటర్‌లో జుట్టుకు నూనెను పెట్టుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టులోని తేమ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
షాంపూని ఇలా మాత్రమే వినియోగించాలి:
జుట్టును షాంపూతో కడగడానికి ముందుగా తప్పకుండా ఆ షాంపూను నీటిలో కరిగించి వినియోగించడం చాలా మంచిది. షాంపూను వినియోగించే క్రమంలో ఒక భాగం షాంపూకి మూడు భాగాల నీటిని కలిపి జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా స్కాల్ప్ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు కూడా చాలా శుభ్రంగా తయారవుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
వేడి నీటితో తల స్నానం చేయోద్దు:
చలికాలంలో చాలా మంది తల స్నానం చేసే క్రమంలో వేడి నీటిని వినియోగిస్తారు. అయితే ఇలా ప్రతి రోజు చేయడం వల్ల జుట్టు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనేక రకాల జుట్టు సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి జుట్టు సమస్యలు ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయడం మానుకోవాల్సి ఉంటుంది.
హెయిర్ డ్రైయర్‌ను వినియోగించడం మానుకోండి:
ప్రస్తుతం చాలా మంది వాతావరణంలో తేమ కారణంగా జుట్టును ఆరబెట్టుకోవడానికి హెయిర్ డైయర్స్‌ను వినియోగిస్తున్నారు. కొంతమందైతే..అతిగా వాడుతున్నారు. అయితే ఇలా వినియోగించడం కూడా మానుకోవని నిపునులు తెలుపుతున్నారు. దీని వల్ల కూడా చాలా మందిలో జుట్టు దెబ్బతింటోందని వారంటున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter