Oatmeal For Weight Loss: శరీర బరువు వారం రోజుల్లో తగ్గాలా.. ?? అయితే ఇది ట్రై చేయండి!

Weight Loss For Oatmeal: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు ప్రతి రోజూ ఆహారంలో పలు రకాల చిట్కాలు పాటిస్తే సులభంగా తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల అనారోగ్య సమస్యల కూడా తగ్గుతాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 02:44 PM IST
Oatmeal For Weight Loss: శరీర బరువు వారం రోజుల్లో తగ్గాలా.. ?? అయితే ఇది ట్రై చేయండి!

Oatmeal For Weight Loss : చెడు జీవన శైలి కారణంగా ఆహారపు వాటిలో మారడం కారణంగా చాలామంది ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా సర్వసాధారణం అయిపోయాయి. దీంతో శరీరం ఫిట్నెస్ కోల్పోయి.. అధిక బరువున పెరుగుతున్నారు. అయితే శరీర బరువు పెరగకుండా బాడీ ఫిట్నెస్ గా ఉండడానికి ఏం తినాలని డైటీషియన్లను సంప్రదిస్తున్నారు. అంతేకాకుండా వారు చెప్పిన సూచనలకు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఈ శరీర బరువుకు సంబంధించిన అంశాల గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఈ క్రింది సలహాలను సూచిస్తున్నారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరం ఫిట్ గా కూడా తయారవుతుందని వారు చెబుతున్నారు.

బరువు తగ్గడానికి అల్పాహారంలో వీటిని తినండి:

ఓట్‌మీల్:
ఊబకాయాన్ని నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఉదయం అల్పాహారంలో ఓట్స్ తో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓట్స్ తో తయారుచేసిన కిచిడి స్మూతీలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ  బలంగా మారుతుంది. అంతే కాకుండా బరువు అదుపులో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఓట్స్ మిల్ తీసుకోవడం చాలా మంచిది.

పాలకూర  స్మూతీ:
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి బచ్చలికూర చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా బరువును కూడా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు బచ్చలికూర  స్మూతీ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడి కండరాలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా సులభంగా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

పనీర్‌:
కాటేజ్ చీజ్ ప్రోటీన్ లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆహారంలో పనీర్‌ ని వినియోగిస్తే ఆకలి నియంత్రణలో ఉండి ఊబకాయం సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ చురుకుగా మారి అజీర్ణం పొట్ట సమస్యలు సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు కోడిగుడ్లు తినడం చాలా మంచిది:
బరువు తగ్గే క్రమంలో అల్పాహారంలో తప్పకుండా రెండు కోడిగుడ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటీన్లు విటమిన్లు లభిస్తాయి కాబట్టి వీటిని తీసుకుంటే శరీరానికి ప్రోటీన్ల అంది బరువు నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సీజన్లో వచ్చే వ్యాధులు కూడా దరిచేరవని వారు భావిస్తున్నారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో అనుసరించే డైట్ లో తప్పకుండా కోడిగుడ్లను తీసుకోవాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Shradha Murder Case: శ్రద్ధా హత్య కేసులో కీలక అప్‌డేట్.. ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం చెప్పిందంటే..!

Also Read: India Vs New Zealand: టీ20ల్లో సూపర్ హీరో.. మొదటి వన్డేలో విలన్‌గా మారాడు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News