Chickpeas: శనగలు ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిది..?

Best Way To Eat Chickpeas: శనగలను ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.  దీని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2024, 03:10 PM IST
Chickpeas: శనగలు ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిది..?

Best Way To Eat Chickpeas: శనగలలో అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇందులో ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్‌, ఐరన్‌, ఫైబర్, ఫోలేట్‌ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యనిపుణులు ప్రకారం  ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే శనగలు తీసుకోవాలి. దీని ఎక్కువగా మొలకెత్తినవి, ఉడికించి, వేయించి కూడా తీసుకుంటారు. అయితే వివిధ రకాలుగా తినడం వల్ల వివిధ ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

శనగలు తినడానికి సరైన మార్గం ఏది? : 

శనగలు వేయించిన తింటే: 

మనలో చాలా మంది వేయించిన శనగలను ఎంతో ఇష్టంగా తింటారు. వేయించిన  శనగలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ వేయించిన శనగలను జలబు, దగ్గు ఉన్నప్పుడు తింటారు, దీని వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.  వేయించిన శనగలు థైరాయిడ్‌ రోగులకు ఎంతో మేలు చేస్తుంది.  అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు ఈ శనగలు తినడం వల్ల ఎన్నో లాభాలు పొందుతారు. 

 శనగలు మొలకెత్తిన తింటే:

మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే మొలకెత్తిన శనగలు తీసుకోవడం వల్ల విటమిన్‌ బి కాంప్లెక్స్‌, ప్రొటీన్, ఫైబర్ శరీరానికి లభిస్తుంది. దీని తీసుకోవడం వల్ల కండరాలను బలంగా తయారు చేసుకోవచ్చు. మొలకెత్తిన శనగలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మీరు మొలకెత్తిన శనగలు తీసుకోవడం కష్టంగా ఉంటే ఇందులోకి ఉల్లిపాయ, దోససాయి, టొమోటో ముక్కలను కలిపి తీసుకోవచ్చు. 

శనగలు ఉడకబెట్టిన తింటే:

ఉడకబెట్టిన శనగలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇందులో ఉప్పు వేసుకుని తింటే సూపర్‌గా ఉంటుంది. అయితే కొంతమంది నెయ్యిలో తాలింపు వేసుకొని కూడా తింటారు. ఉడకబెట్టిన శనగలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటారు.  దీని మీరు మీ ఆహారంలో భాగంగా కూడా తీసుకోవచ్చు. అయితే ఈ శనగలను కొంతమంది అసలు తీసుకోకుండా ఉండాలి. 

ఎలాంటి వారు శనగలు తీసుకోకూడదు:

శనగలు ఆరోగ్యానికి మేలు చేసిన కొందమంది వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడుతుంటారు. ఆయుర్వేద నిపుణులు ప్రకారం వాత సమస్యలు ఉన్నవారు శనగలను తీసుకోకుండా ఉండాలి. అలాగే సన్నగా, బలహీనంగా ఉన్నవారు కూడా నల్ల శనగలను తీసుకోకుండా ఉండాలి.  అలాగే మలబద్దకం సమస్యతో బాధపడుతున్నవారు ఈ నల్ల శనగలకు దూరంగా ఉండాలి. చర్మం పొడిగా, గరుకుగా ఉన్నవారు కూడా ఈ శనగలను తీసుకోకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 

Also Read Foods To Reduce Fever: జ్వరంతో బాధపడుతున్నారా.. వీటిని తీసుకుంటే సమస్యకు చెక్‌ !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News