World Hypertension Day 2024: అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడేవారు సులభంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుంటారు. అయితే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా ముందుగానే శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే హైపర్‌టెన్షన్ సమస్య మరింత పెరిగి అనేక సమస్యలకు దారీ తీసే ఛాన్స్ ఉంది. అయితే ఈ అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన ఆహారం:
రక్తపోటు సమస్యలతో బాధపడేవారు దీనిని నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రతి రోజు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. రోజు తినే ఆహారాల్లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు సంతృప్త కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సి ఉంటుంది.
సోడియం కలిగిన ఆహారాలకు దూరం:
ఎక్కువ మోతాదులో సోడియం కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీర బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సోడియం కలిగిన ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారు తప్పకుండా వీటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
వ్యాయామం చేయాలి:
హై బీపీ సమస్యతో బాధపడేవారు తప్పకుండా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యలతో బాధపడేవారు కానీసం 150 నుంచి 200 నిమిషాల పాటు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
బరువును అదుపులో ఉంచుకోండి:
అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీర బరువును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారు బరువు పెరిగితే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఒత్తిడికి దూరంగా ఉండి:
చాలా మందిలో ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారు ఒత్తిడి బారిన పడితే అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి