Honey Moon Express Teaser: అమల అక్కినేని చేతుల మీదుగా "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమా టీజర్ లాంఛ్..

Honey Moon Express Teaser: హెబ్బా పటేల్,  చైతన్య రావ్ జోడిగా  నటిస్తున్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన  ఈ సినిమాని బాల శేఖరుని దర్శకత్వం వహించారు. జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాను టీజర్ ను అక్కినేని అమల విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 10, 2024, 03:50 PM IST
Honey Moon Express Teaser: అమల అక్కినేని చేతుల మీదుగా "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమా టీజర్ లాంఛ్..

Honey Moon Express Teaser: ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’  ఈ పేరుతోనే సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాడు. పూర్తి ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను అమల అక్కినేని విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంది.

ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ..
యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో ప్రొఫెసర్ గా బాల అమెరికాలో చాలా కాలం పనిచేసిన విషయాన్ని అమల గారు ప్రస్తావించారు. అమెరికాలో ఉన్న, ఆయనకు ఏదో ఒకరోజు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలని ఉండేది. ఆయన కల ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సినిమాతో నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. టీచింగ్ ఒక బాధ్యత అయితే ఫిల్మ్ మేకింగ్ మరో సవాలు లాంటిది. మా అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీలు, స్టాఫ్, స్టూడెంట్స్ ను బాల  హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ లోకి తీసుకున్నందుకు హ్యాపీగా  ఉంది. సినిమా టీజర్ ఫన్నీగా, రొమాంటిక్ గా ఉంది. ఈ రోజు సమాజంలోని రొమాంటిక్, వివాహ బంధాలను గురించి ఒక బలమైన కథను చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుందన్నారు. ఈ రోజు పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది ఈ మూవీ సబ్జెక్.  ఈ నెల జూన్ 21న, హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ని ఆదరించి, విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. బాల, ఆయన టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News