C 202: చిన్న చిత్రాల్లో పెద్ద సంచలనం C 202.. త్వరలో 50 రోజులకు చేరువలో మూవీ..

C 202: తెలుగు సహా ఇతర భాషల్లో హార్రర్ కాన్సెప్ట్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. కంటెంట్ బాగుంటే చాలు ఆదరించడానికి మేము రెడీ అంటున్నారు ప్రేక్షకులు. ఈ కోవలో వచ్చిన చిత్రం C 202. అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ త్వరలో 50 రోజుల పరుగు పూర్తి చేసుకోబోతుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 3, 2024, 09:27 AM IST
C 202: చిన్న చిత్రాల్లో పెద్ద సంచలనం C 202.. త్వరలో 50 రోజులకు చేరువలో మూవీ..

C 202: మున్నా కాశీ హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘C 202’. ఈ చిత్రాన్ని మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మించారు.  హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ చిత్రం అక్టోబర్ 25న విడుదలై ఆరు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన కేంద్రాలైన విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ సహా ఇతర ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ రన్ అవుతూ దూసుకుపోతుంది. మరో వారంతో ఈ సినిమా 50 రోజుల పరుగును పూర్తి చేసుకోబోతుంది.  

ఈ సందర్భంగా హీరో దర్శకుడు మున్నా కాశీ మాట్లాడుతూ.. "సి 202 చిత్రం అక్టోబర్ 25న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. మంచి రివ్యూస్, మౌత్ టాక్ తో ప్రేక్షకుల ఆదరణ పొందింది. అంతేకాదు గత  ఆరు వారాలుగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

ఇప్పుడు C 202 మా చిత్రం ఏడో వారంలోకి ప్రవేశించడం విశేషం. ఇప్పటికే రూ. 50 లక్షల షేర్ వసూళ్లు చేసింది. మరో వారం రోజుల్లో 50 రోజుల మైలురాయి చేరుకుంటుంది. మా సి 202 చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చూడని వారు మీ సమీప థియేటర్ లో చూడండి అంటున్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైన ఎంత పెద్ద చిత్రమైన మూడు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. అలాంటి ఈ సినిమా ఇప్పటికీ థియేట్రికల్ గా రన్ అవుతూ దూసుకుపోతుండటం విశేషం.

ఈ చిత్రంలో మున్నా కాశీ హీరోగా నటించారు. షారోన్ రియా ఫెర్నాండెజ్ కథానాయికగా నటించింది. ఇతర ముఖ్యపాత్రల్లో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన తదితరులు నటించారు.

ఇదీ చదవండి:  Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..

ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News