Darshini Release date: టాలీవుడ్‌లో మరో థ్రిల్లర్ మూవీ 'దర్శిని'.. మే 17న థియేటర్స్‌లో విడుదల..

Darshini Release date: వి4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై వికాస్ మరియు శాంతి హీరో హీరోయిన్లుగా డాక్టర్ ప్రదీప్ అల్లు డైరెక్షన్‌లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'దర్శిని'. ఇప్పటికే సెన్సార్ వాళ్లు 'U/A' సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమాను మే 17న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 8, 2024, 07:44 PM IST
Darshini Release date: టాలీవుడ్‌లో మరో థ్రిల్లర్ మూవీ 'దర్శిని'.. మే 17న థియేటర్స్‌లో విడుదల..

Darshini Release date: డాక్టర్ ఎల్.వి. సూర్యం నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'దర్శిని'. ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ చిత్రం చూసి సెన్సార్ వాళ్లు బాగుందని కామెంట్స్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. మే 17న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.మా మూవీ రిలీజ్‌కు  సపోర్ట్ చేసిన నిర్మాత దామోదర్ ప్రసాద్‌కి ఈ సందర్భంగా  ధన్యవాదాలు తెలియజేసారు. మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేసిన విషయాన్ని ప్రస్తావించారు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ముగ్గురు మిత్రులకి భవిష్యత్తు చూపించే యంత్రం దొరికితే దానివల్ల వచ్చే పరిణామాలు మరియూ పర్యవసానాలే మా సినిమా దర్శిని. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా సినిమాలో ఉన్నాయని ప్రస్తావించారు.  తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం బాగా నచ్చుతుందన్నారు.

దర్శకుడు డాక్టర్ అల్లు ప్రదీప్ మాట్లాడుతూ.. కే.ఎల్. దామోదర్ ప్రసాద్ మా గాడ్ ఫాదర్. ఈ సినిమా విడుదలకు మాకు సపోర్ట్ ఇచ్చారు. మా నిర్మాత, మా కో డైరెక్టర్, మా హీరో, హీరోయిన్ మేమందరం ఇపుడు ఒక ఫ్యామిలీ. అందరం సొంతగా పనిచేసామన్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు. అంతేకాదు సెన్సార్ వాళ్ల ప్రశంసలు లభించాయి. మే 17న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాము.  

హీరో వికాస్ మాట్లాడుతూ "మా చిత్రానికి పునాది మా దర్శకుడు డాక్టర్ అల్లు ప్రదీప్ అల్లు. ఈ ప్రయాణంలో  చాలా కష్టాలు చూసాము.  కానీ సినిమా మీద ప్యాషన్ తో కష్టపడి పని చేసాము. సినిమా చాలా బాగా వచ్చింది. మే 17న విడుదల అవుతుంది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు.   అని తెలిపారు.

బ్యానర్ : వి 4 సినీ క్రియేషన్స్

చిత్రం పేరు : దర్శిని

నటీనటులు : వికాస్, శాంతి, సత్య ప్రసాద్, తదితరులు

కెమెరా మాన్ : రవి మిల్కీ

ఎడిటర్ : ప్రవీణ్ జైరాజ్, చందు చలమల

సంగీతం : నిజాని అంజన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శివ ప్రసాద్

డి ఐ : బి 2 హెచ్ స్టూడియోస్

కలరిస్ట్ : వెంకట్

డబ్బింగ్ : సిద్ధూ పట్నాన, రాజు గరుడే

సౌండ్ ఇంజనీర్ : దామోదర్ రావు

వి ఎఫ్ ఎక్స్ : ప్రవీణ్ జైరాజ్

డిజైన్స్ : ఎమ్ కె ఎస్ మనోజ్

పి ఆర్ ఓ : పాల్ పవన్

డిజిటల్ మార్కెటింగ్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్

లైన్ ప్రొడ్యూసర్ మరియు కో డైరెక్టర్ : కె  సంతోష్ కుమార్

దర్శకుడు : డాక్టర్ ప్రదీప్ అల్లు

ప్రొడ్యూసర్ : డాక్టర్ ఎల్ వి సూర్యం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News