Eesaraina movie: ‘ఈ సారైనా’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

Eesaraina movie:  తెలుగులో ఈ మధ్యకాలంలో రియస్టిక్ స్టోరీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ సారైనా’. తాజాగా నటుడు కమ్ దర్శకుడు విప్లవ్ తానే హీరోగా గవర్నమెంట్ ఉద్యోగం నేపథ్యంలో ‘ఈ సారైనా’ సినిమా తెరకెక్కించాడు. ఈ రోజు విడుదైల ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. .

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 8, 2024, 08:35 PM IST
Eesaraina movie: ‘ఈ సారైనా’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

రివ్యూ: ఈ సారైనా (Eesaraina)

నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, నీతు క్వీన్, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్,సత్తన్న,అశోక్ మూలవిరాట్

ఎడిటర్:  విప్లవ్

సినిమాటోగ్రఫీ: గిరి

సంగీతం: తేజ్

నిర్మాత : విప్లవ్

కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విప్లవ్

విడుదల తేది: 8-11-2024

ఈ మధ్య కాలంలో మన హీరోలు దర్శకులుగా, నిర్మాతలుగా మారుతూ తమ తలరాతను తామే మార్చుకంటున్నారు. ఈ కోవలో విప్లవ్.. హీరోగా నటిస్తూ మెగా పట్టుకున్న చిత్రం ‘ఈ సారైనా’.  ప్రస్తుతం మనలో  ఎక్కువ మంది గవర్నమెంట్ ఉద్యోగం అంటే పిచ్చి. ఎలాగో అలా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అయిపోట్టే భావిస్తారు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ సారైనా’. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

డిగ్రీ కంప్లీటై నాలుగేళ్లు అవుతున్న జాబ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటాడు రాజు (విప్లవ్).  ఇక అదే ఊర్లో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది శిరీష (అశ్విని). మూడో సార్లు నోటిఫికేషన్ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతాడు. ఈ నేపథ్యంలో  శిరీష తండ్రి నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే నా కూతురును ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితులతో ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసాడు. చివరకు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడి, నిర్మాత, హీరో అతనే కావడంతో తనకు ఎలాంటి కథ సూట్ అవుతుందో పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ స్టోరీకి కనెక్ట్ అవుతారు. సమాజంలోని కాన్ టెంపరరీ ఇష్యూ తీసుకొని.. దాన్ని తనదైన కథనంతో పాటు కాస్తంత లవ్ స్టోరీ యాడ్ చేసి ప్రేక్షకులను అలరించాడు. కొన్ని సీన్స్ కామన్ ఆడియన్స్ ను కదలిస్తాయి. ఈసారైనా ప్రభుత్వ ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలనే సగటు నిరోద్యోగులు కనెక్ట్ అవుతారు. హీరో తన సొంత ఊరులో సినిమాను నిర్మించడం మరుో విశేషం. నిర్మాతగా, దర్శకుడిగా మంచి టాలెంట్ చూపించాడు. సహ నిర్మాతగా సంకీర్త హీరోకు బ్యాక్ బోన్ గా నిలిచారు. గిరి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటోంది.

నటీనటుల విషయానికొస్తే..
ఓ సగటు పల్లెటూరు యువకుడి పాత్రలో మెప్పించాడు. ప్రభుత్వ ఉద్యోగం  కోసం ప్రయత్నిస్తున్న యువకుడి పాత్రలో మెప్పించాడు. నటుడిగా, దర్శకుడిగా మంచి భవిష్యత్తు ఉంది. హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. తండ్రి పాత్రలో ప్రదీప్ రాపర్తి నటన బాగుంది. మిగిలిన నటీనటులు తన పరిధి మేరకు మెప్పించారు.  

ప్లస్ పాయింట్స్..

కథ,

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ ల్యాగ్

తెలిసిన నటీనటుల లేకపోవడం

రేటింగ్ : 2.75/5

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News