Consequences Of Not Linking PAN With Aadhaar: ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోవడం వల్ల కలిగే పరిణామాలు ఏంటనేది చాలామందికి అవగాహన లేదు. అయితే, భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు, పలు ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కచ్చితంగా మీరు మీ ఆధార్ నెంబర్ని పాన్ నెంబర్‌తో లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే కలిగే ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం రండి.
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేరు
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే మీరు మీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేయలేరు. ఆధార్ కార్డుతో లింక్ చేయని పాన్ కార్డ్స్ ఇనాక్టివేట్ అవడం వల్ల మీరు ఐటి రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఆదాయపు పన్ను శాఖ మీ ఐటి రిటర్న్‌ను అంగీకరించదు. ఈ కారణంగా మీకు మీరు చెల్లించాల్సిన ఆదాయ పన్నుపై పెనాల్టీ లేదా వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు.
భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేయలేరు
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే మీరు అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేయడానికి వీల్లేకపోవచ్చు. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా... ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేయాలన్నా.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వంటి లావాదేవీల విషయంలో మీ పాన్, ఆధార్ లింక్ చేసి లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు మీ దరఖాస్తులను తిరస్కరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
పాన్ కార్డు చెల్లదు
మీరు మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోవడం వల్ల మీ పాన్ కార్డు ఇనాక్టివేట్ అవుతుంది. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా మీరు మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయలేకపోతే, మీ పాన్ చెల్లుబాటు కాకుండాపోతుంది. అదే కానీ జరిగితే.. ఆ తరువాత కాలంతో మీరు మీ పాన్ కార్డును ఉపయోగించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయలేరు. ఆ తరువాత మీరు మళ్లీ కొత్త PAN కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒక పాన్ కార్డు కలిగి ఉండి, అది చెల్లుబాటు కాకుండా పోవడం వల్ల రెండో కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి కఠినమైన నిబంధనలు వర్తించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : Best Mileage Bike: చీప్ అండ్ బెస్ట్ బైక్.. ధర రూ. 65 వేలలోపు.. మైలేజ్ 75 కి.మీ
టీడీఎస్ క్లెయిమ్‌లో మార్పులు
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోవడం వల్ల కలిగే మరో పరిణామం ఏంటంటే.. మీ ఆదాయం నుండి తగ్గించిన టీడీఎస్ స్టాండర్డ్ రేటు కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా మీ టేక్-హోమ్ శాలరీ తగ్గే అవకాశం ఉంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయకపోవడం అనేది ఆర్థికంగా, వ్యాపారలావాదేవీల పరంగా ఇలా ఎన్నో అంశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి : Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొన్నారా ? ఈ ఐదూ ఎప్పుడూ మీతో ఉండాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK