/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Bizarre News: భారతీయ చట్టాల ప్రకారం ఒక వ్యక్తి ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ముస్లీం మతాచారం ప్రకారం పురుషులు ఎంత మంది స్త్రీలను అయినా వివాహం చేసుకోవచ్చు.. కానీ ఇండియాలో ఎక్కువగా బహు భార్యత్వం కనిపించదు. కానీ బీహార్‌ లోని అర్వల్‌ జిల్లా ఒక రెడ్‌ లైట్ ఏరియాలో 40 మంది మహిళలు ఒక్క వ్యక్తిని తమ భర్తగా భావిస్తూ ఉన్నారు. అంతే కాకుండా చాలా మంది పిల్లలు కూడా తమ తండ్రిగా అతడి పేరును చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. అధికారికంగా పెళ్లి చేసుకోకున్నా కూడా అధికారిక లెక్కల ప్రకారం అతడు 40 మంది ఆడవారికి భర్తగా నిలిచాడు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లో ప్రస్తుతం కుల గణన జరుగుతోంది. అందులో భాగంగా కులాల వారిగా ఆర్థిక స్థితిగతులు మరియు ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో అర్వల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండే రెడ్‌ లైట్ ఏరియాలో అధికారులు కుల గణనకు వెళ్లారు. అక్కడి వారు తాము ఏ కులానికి చెందిన వాళ్లం కాదు అని పేర్కొన్నారు. అంతే కాకుండా 40 మంది మహిళలు తమ భర్తగా ఒకే ఒక్క పేరును చెప్పారు. 40 మంది మహిళలు మాత్రమే కాకుండా ఎంతో మంది పిల్లలు కూడా తమ తండ్రిగా అతడి పేరునే చెప్పడం జరిగింది. ఆ పేరే రూప్‌ చంద్‌. అంత మందిని అతడు పెళ్లి చేసుకోలేదు.. నిజంగా ఆ పిల్లలకు అతడు తండ్రి కాదు. కానీ అధికారిక లెక్కల ప్రకారం మాత్రం రూప్ చంద్‌ వారి యొక్క తండ్రి మరియు తండ్రిగా కొనసాగుతున్నాడు. 

అసలు విషయం ఏంటి అంటే.. ఆ రెండ్ లైట్ ఏరియాలో వందల మంది ఆడవారు పెళ్లి చేసుకోకుండా జీవనం సాగిస్తున్నారు. వారి యొక్క వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. దాంతో చాలా మంది పిల్లలకు కూడా తండ్రి ఎవరు అనే విషయమై స్పష్టత లేదు. అందుకే ఆ ప్రాంతంలో నివాసం ఉండే డాన్స్ మాస్టర్ రూప్‌ చంద్ అంటే అందరికి అభిమానం. ఆ అభిమానంతోనే చాలా మంది మహిళలు అతడిని భర్తగా భావిస్తూ ఉంటారు. రూప్ చంద్‌ కు ఆ ప్రాంతంలో కనీసం ఇల్లు కూడా లేదు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అతడికే తెలిలయదు. అలాంటి వ్యక్తిని భర్త గా చెప్పుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు అని మహిళలు ఇలా చెబుతున్నారని అధికారులకు తెలిసింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కులాలు ఉన్నాయి కానీ అక్కడ ఒక్క చోట మాత్రం కులాల ప్రస్తావన లేదని అధికారులు పేర్కొన్నారు.

Also Read: AP Inter Results 2023: ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
a single persona as a husband for 40 women in Arwal district Bihar
News Source: 
Home Title: 

ఆ ఊర్లో ఆడవారందరికీ ఒక్కడే భర్త.. జనాభా లెక్కలకు వెళ్లిన అధికారులు షాక్!

ఆ ఊర్లో ఆడవారందరికీ ఒక్కడే భర్త.. జనాభా లెక్కలకు వెళ్లిన అధికారులు షాక్!
Caption: 
Bihar News (File Photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఆ ఊర్లో ఆడవారందరికీ ఒక్కడే భర్త.. జనాభా లెక్కలకు వెళ్లిన అధికారులు షాక్!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, April 26, 2023 - 19:56
Request Count: 
34
Is Breaking News: 
No
Word Count: 
316