Gajlaxmi Rajyog 2023: గజలక్ష్మీ రాజయోగంతో ఈ రాశులకు తిరుగులేనంత ధనం.. ఈ జాబితాలో మీ రాశి ఉందా?

Guru Gochar 2023: రీసెంట్ గా బృహస్పతి సంచారం వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఈ పవిత్రమైన యోగం వల్ల  ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 6, 2023, 12:04 PM IST
Gajlaxmi Rajyog 2023:  గజలక్ష్మీ రాజయోగంతో ఈ రాశులకు తిరుగులేనంత ధనం.. ఈ జాబితాలో మీ రాశి ఉందా?

Gajlaxmi Rajyog 2023 Benefits: ఆస్ట్రాలజీ ప్రకారం, సమయానికి అనుగుణంగా గ్రహాలు రాజయోగాలను ఏర్పరుస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో 32 రాజయోగాలు గురించి చెప్పబడ్డాయి. గత నెల 22న బృహస్పతి తన రాశిని మార్చాడు. గురుడు సంచారం వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గజలక్ష్మి యోగం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. 

తులారాశి
ఈ రాశి యెుక్క ఏడవ ఇంట్లో గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 
కర్కాటక రాశి
గజలక్ష్మి రాజయోగం కర్కాటక  రాశి వారి జాతకంలో పదో ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి. ధన లాభదాయకంగా ఉంటంది. మెుత్తానికి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. 
మీనరాశి
మీనం యొక్క రెండవ ఇంట్లో  గజలక్ష్మి రాజయోగం సంభవించబోతుంది. ఈ శుభ యోగం మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసేలా చేస్తుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. 

Also Read: Lucky zodiacs: ఈ 3 రాశులవారిపై కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News