The Kerala Story: 'ది కేరళ స్టొరీ' బ్యాన్ చేసిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే?

The Kerala story banned in west Bengal: ఈ మధ్యకాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి విడుదలైన ది కేరళ స్టోరీ మూవీని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 9, 2023, 07:25 PM IST
The Kerala Story: 'ది కేరళ స్టొరీ' బ్యాన్ చేసిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే?

The Kerala story ban in west Bengal: ఈ మధ్యకాలంలో విడుదలైన ది కేరళ స్టోరీ మూవీ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఆదాశర్మ, యోగితా భిహాని, సిద్ధి ఇద్నాని, ప్రణయ్ పచౌరీ, సోనియా బలాని, ప్రణవ మిశ్రా, విజయ్ కృష్ణ, ఉషా సుబ్రహ్మణ్యన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాని సుదీప్తో సేన్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాని విపుల్ అమృతలాల్ షా నిర్మించారు.  ఇక ఈ సినిమాని ప్రోత్సహించడానికి ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు టాక్స్ ఫ్రీ సినిమాగా ప్రకటిస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాత్రం ఈ సినిమాని రాష్ట్రంలో ప్రదర్శించకూడదని చెబుతూ బ్యాన్ చేసింది.

నిజానికి ఈ సినిమాలో ఇతర మతాలకు చెందిన యువతులను ఇస్లాంలోకి మార్చి ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేర్చేందుకు దేశాలు దాటిన వ్యవహారాన్ని చూపించారు. ముందుగా ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇప్పటివరకు కేరళలో 32 వేల మంది యువతులు ఇలా అదృశ్యమయ్యారని చెప్పినా తర్వాత ఇది కేవలం ముగ్గురు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా అని ప్రచారం చేస్తున్నారు.

Also Read: The Kerala Story tax free: ఆ రాష్ట్రాల్లో టాక్స్ ఫ్రీగా 'ది కేరళ స్టోరీ'..టికెట్లు ఎంత తక్కువకి దొరుకుతాయంటే?

తాజాగా ఈ సినిమాని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వారు వెల్లడించారు. నిజానికి ఈ సినిమా మేకర్స్ ఈ సినిమాని ఎంతో రీసెర్చ్ చేసామని చెబుతుంటే కొంతమంది విశ్లేషకులు మాత్రం ఈ సినిమాని ఒక ప్రోపగాండా సినిమాగా అభివర్ణిస్తున్నారు.

నిజానికి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు చాలా కాలం నుంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ సినిమాని ప్రమోట్ చేస్తుందని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ మేరకు సినిమాని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపి మమతా బెనర్జీ చర్యలను ఖండిస్తోంది.

ఇక ఇదే అంశం మీద ఫెడరల్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ బెంగాల్ ప్రభుత్వం బాధితుల మీద జాలి చూపకుండా టెర్రరిస్ట్ గ్రూపుల మీద జారి చూపుతోందని పేర్కొన్నారు. నిజానికి ఈ సినిమా మీద ప్రధాని మోడీ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. గత వారంలో కర్ణాటకలో ఎలక్షన్స్ క్యాంపైన్ నిర్వహిస్తున్న ఆయన టెర్రరిజం సమాజం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనే అంశాన్ని ఈ సినిమాలో చూపించారని ఆయన చెప్పుకొచ్చారు.  
Also Read: Sonia Balani: 'ది కేరళ స్టోరీ'లో ముస్లిం అమ్మాయిగా నటించిన సోనియా బలానీ మోడ్రన్ డ్రెస్సుల్లో అదిరిపోయింది చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News