Virat Kohli Bowling: పాడ్స్ కట్టుకుని మరీ బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. గ్లెన్ మాక్స్‌వెల్ కామెంటరీ అదుర్స్! వైరల్ వీడియో

Glenn Maxwell commentary Video Goes Viral Ahead Of SRH vs RCB Match. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన విరాట్‌ కోహ్లీ.. ఆపై బౌలింగ్ కూడా చేశాడు. పాడ్స్ కట్టుకునే ఫాఫ్‌ డుప్లెసిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌లకు బాల్స్ వేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 18, 2023, 05:33 PM IST
Virat Kohli Bowling: పాడ్స్ కట్టుకుని మరీ బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. గ్లెన్ మాక్స్‌వెల్ కామెంటరీ అదుర్స్! వైరల్ వీడియో

Virat Kohli Bowling Video Goes Viral Ahead Of SRH vs RCB Clash In IPL 2023: ఐపీఎల్‌ 2023లో ప్లేఆఫ్స్‌ రేసు ఉత్కంఠగా సాగుతోంది. గుజరాత్‌ టైటాన్స్ ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు రేసులో ఉన్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ రేసులో ముందున్నాయి. ఈ జట్లకు ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ నేపథ్యంలోనే నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో బెంగళూరు తలపడనుంది. బెంగళూరుకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచేందుకే ఫాఫ్ సేన చూస్తోంది. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకం కాబట్టి ఆటగాళ్లు అందరూ తీవ్రంగా సన్నద్ధమవుతున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గెలిచేందుకు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు ప్రాంచైజీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ నెట్స్‌లో కష్టపడుతున్నారు. ముందుగా కోహ్లీ, డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌ భారీ షాట్లు ఆడారు. ముఖ్యంగా కోహ్లీ రెచ్చిపోయి ఆడాడు. అన్ని షాట్స్ ఆడుతూ అలరించాడు. 

బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన విరాట్‌ కోహ్లీ.. ఆపై బౌలింగ్ కూడా చేశాడు. పాడ్స్ కట్టుకునే ఫాఫ్‌ డుప్లెసిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌లకు బాల్స్ వేశాడు. అయితే ఫాఫ్, మ్యాక్సీలు కలిగి ఉతికారేశారు. దాంతో కోహ్లీ నవ్వుకుంటూ పోయాడు. ఈ సమయంలో మ్యాక్సీ కామెంటరీ చెప్పాడు. ఆపై ముగ్గురూ కలిసి మరోసారి బ్యాటింగ్ చేశారు. ఇందుకు సంబందించిన వీడీయోను బెంగళూరు ప్రాంచైజీ పోస్ట్ చేసింది. కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్, ఫాఫ్) చాప్టర్ 3 అని పేర్కొంది. ఈ వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News