DC vs CS: చెన్నైకి కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన ఎంఎస్ ధోనీ! తుది జట్లు ఇవే

IPL 2023 Match 67 DC vs CSK Today Match Playing 11. మరికొద్దిసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : May 20, 2023, 03:24 PM IST
DC vs CS: చెన్నైకి కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన ఎంఎస్ ధోనీ! తుది జట్లు ఇవే

DC vs CSK IPL 2023 Match 67 Live Score Updates: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు డబుల్‌ హెడ్డర్స్‌ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఢిల్లీ ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని చెన్నై కెప్టెన్ తెలిపాడు. మరోవైపు ఒక మార్పు చేశామని ఢిల్లీ సారథి డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. 

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. లక్నోకు కూడా 15 పాయింట్స్ ఉన్నాయి. అయితే నెట్‌ రన్‌రేట్‌ కారణంగా రాహుల్ సేన మూడో స్థానంలో ఉంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో చెన్నై విజయం సాధిస్తే.. ఆ జట్టు ఖాతాలో 17 పాయింట్లు ఉంటాయి. దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌కు చెన్నై వెళుతుంది. భారీ విజయం సాధిస్తే.. రెండో స్థానం దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడితే మాత్రం లక్నో, ముంబై, బెంగళూరు జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

16వ సీజన్‌లో చెపాక్‌ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. డిల్లీకి నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఛేదించింది. దీంతో మరోసారి ఢిల్లీని ఓడించి.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలని చెన్నై చూస్తోంది. అదే సమయంలో చెన్నై ఫాన్స్ కూడా ఇదే ఆశిస్తున్నారు. అయితే ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచ్‌ కావడంతో డేవిడ్ సేనను అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (కీపర్), రిలీ రోసోవ్, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్. 
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ. 

డ్రీమ్11 టీమ్:
కీపర్ - డెవాన్ కాన్వే, ఫిలిప్ సాల్ట్ (వైస్ కెప్టెన్)
బ్యాట్స్‌మెన్ - డేవిడ్ వార్నర్, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్)
ఆల్ రౌండర్లు - రవీంద్ర జడేజా, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్, మొయిన్ అలీ
బౌలర్లు - తుషార్ దేశ్‌పాండే, మహేశ్ పతిరానా. 
Also Read: Yashasvi Jaiswal: భారత జట్టులో ఆ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలి: గవాస్కర్

Also Read: Bandla Ganesh Devara : నా టైటిల్ కొట్టేశారు.. ఎన్టీఆర్ దేవరపై బండ్ల గణేష్ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News