తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోతున్నాయి. ఇటీవల ఐక్యరాజ్య సమితి రాబోయే అయిదు సంవత్సరాల పాటు ఈ ఎండలు తప్పవు అంటూ హెచ్చరించారు. ఎండల నుండి ఉపశమనం పొందేందుకు వందల మార్గాలు ఉన్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు ఎండల నుండి ఉపశమనం పొందుతున్నారు. ఎక్కువ శాతం మంది ఎండల భయానికి ఇంట్లో నుండి బయటకు వెళ్లడం లేదు.
కొందరు సాధ్యం అయినంత ఎక్కువగా లిక్విడ్ ని తీసుకుంటున్నారు. ఇక ఎక్కువ శాతం మంది చల్లని పానియాలను తాగుతూ ఎండ నుండి ఉపశమనం పొందుతూ ఉన్నారు. ఇక మందు బాబులు బాటిళ్లకు బాటిల్స్ లేపుతూ ఈ ఎండ నుండి చల్లబడుతున్నారు. ఈ ఎండలు ఏమో కానీ ప్రభుత్వానికి వందల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారుల ద్వారా సమాచారం అందుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బీర్ ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు గత నెల రోజులుగా విపరీతంగా పెరిగాయి. ఇటీవల పెరిగిన బీర్ల అమ్మకాలతో అదనంగా రాష్ట్ర ఖజానాకి భారీ మొత్తంలో ఆదాయం వచ్చి చేరినట్లుగా సమాచారం అందుతోంది. తెలంగాణ లో గడచిన 15 రోజుల్లో 35 లక్షల కాటన్ల బీర్లు ఖాళీ అయ్యాయి.
ఈ నెలలో రికార్డు స్థాయి బీర్ల అమ్మకాలు జరిగినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నారు. 18 రోజుల్లో తెలంగాణ తాగుబోతులు ఏకంగా 4 కోట్ల 23 లక్షల బీర్ బాటిల్స్ ను ఖాళీ చేశారు. వీటి విలువ రూ.582.99 కోట్లు. గతంతో పోల్చితే ఈ మొత్తం దాదాపు రెట్టింపుగా అధికారులు చెబుతున్నారు. జూన్ నెల వరకు ఇదే పరిస్తితి కొనసాగబోతుంది అంటూ మధ్యం షాప్ యాజమాన్యాలు చెబుతున్నారు.
Also Read: Revanth Reddy: కేసీఆర్‌ను కోసి కారం పెట్టినా తప్పులేదు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మే నెలలో మొదటి 18 రోజుల్లోనే 35,25,247 బీర్ కాటన్ లు అమ్ముడు పోయాయి. ఒక్క కాటన్ లో పన్నెండు బీర్లు ఉంటాయనే విషయం తెల్సిందే. ఆ లెక్కన ఈ నెల మొదటి 18 రోజుల్లోనే ఏ స్తాయిలో బీర్లు అమ్ముడు పోయాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ నెలలో రాబోయే రోజుల్లో ఫంక్షన్స్ కూడా భారీగా ఉండబోతున్నాయి. కనుక ఈ నెల పూర్తి అయ్యేప్పటికి 80 లక్షల బీర్ ల కాటన్స్ అమ్ముడు పోయినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నల్లగొండ జిల్లాలో మే నెల ప్రారంభం నుండి 18వ తారీకు వరకు 3 లక్షలకు పైగా కాటన్ల బీర్లు అమ్ముడు పోయాయి. వీటి విలువ రూ.48.14 కోట్లు. నల్లగొండ తర్వాత స్థానంలో కరీంనగర్ నిలిచింది.
ప్రస్తుతం ఎండలు మండి పోతున్న కారణంగా బీర్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కేవలం బీర్లు మాత్రమే కాకుండా ఇతర బ్రాండ్స్ కూడా అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ రెండు నెలల పాటు ప్రభుత్వానికి వందల కోట్ల లాభం రాబోతుంది.
Also Read: YS Sharmila: కేసీఆర్ పేరు మార్చుకున్నారు.. కొత్త పేరు ఏంటంటే.. వైఎస్ షర్మిల సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook