పద్మావత్ సినిమాను ప్రభాస్ వద్దన్నాడా ?

పద్మావతి చిత్రంలో ప్రభాస్ చేయాల్సిన మహారావల్ రతన్ సింగ్ పాత్రలో షాహీద్ కపూర్ ?

Last Updated : Aug 14, 2018, 07:46 PM IST
పద్మావత్ సినిమాను ప్రభాస్ వద్దన్నాడా ?

టైటిల్, కథనం పరంగా ఎన్నో వివాదాల్లో చిక్కుకోవడంతోపాటు పలు రాష్ట్రాల్లో నిషేధానికి గురైన పద్మావత్ సినిమా బాలీవుడ్‌లో కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించింది. వివాదాల సంగతి ఎలా ఉన్నా... బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా నటీనటులకు సైతం మంచి పేరు తీసుకొచ్చింది. బాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. అయితే, బాలీవుడ్‌లో రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాలో మన డార్లింగ్ ప్రభాస్‌కి నటించే అవకాశం వచ్చిందా అంటే అవుననే తెలుస్తోంది. అవును, పద్మావత్ చిత్రంలో షాహీద్ కపూర్ పోషించిన మహారావల్ రతన్ సింగ్ పాత్రలో నటించే అవకాశం మొదటిగా ప్రభాస్ తలుపు తట్టిందట! అయితే, అప్పటికే బాహుబలి : ది బిగినింగ్ సినిమా అందించిన సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ, యావత్ సినీ ప్రముఖుల అభినందనలు అందుకుంటున్న ప్రభాస్ బాహుబలి : ది కన్‌క్లూజన్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. 

బాహుబలి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న దశలో మహారావల్ రతన్ సింగ్ పాత్రను ఎంచుకోవడం సరికాదేమోనని సందేహించిన ప్రభాస్.. ఆ పాత్ర పోషించడానికి నో చెప్పాడట. అయితే, అదే సమయంలో భన్సాలీ దర్శకత్వంలో సినిమా చేయడానికి మాత్రం తనకు ఇష్టమేనని తెలిపాడట ప్రభాస్. అలా ప్రభాస్ చేయాల్సిన మహారావల్ రతన్ సింగ్ పాత్ర షాహీద్ కపూర్ చేతికి చిక్కినట్టు టాలీవుడ్ మీడియా వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 

Trending News