Ind VS Aus WTC Final 2023 day 4 Live Updates: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాకు 444 పరుగుల లక్ష్యాన్ని విధించింది ఆస్ట్రేలియా. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి.. 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని.. భారత్‌కు 444 టార్గెట్ నిర్దేశించింది. 137 ఓవర్ల ఆట మిగిలి ఉన్న వేళ.. టీమిండియా ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే రికార్డు సృష్టిస్తుంది. అయితే పిచ్ కండిషన్ చూస్తుంటే సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. నాలుగో రోజు ఆసీస్ బ్యాట్స్మెన్లలో వికెట్ కీపర్ అలెక్స్ కారీ (66), మిచెల్ స్టార్క్ (41) రాణించారు. భారత బౌలర్లలో జడేజా మూడు, షమీ, ఉమేశ్ యాదవ్ చెరో రెండు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభామే ఇచ్చారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. తొలి వికెట్‌కు 7 ఓవర్లలోనే 41 పరుగులు జోడించారు. 19 బంతుల్లోనే 18 పరుగులు చేసిన గిల్.. అనూహ్యంగా ఔట్ అయ్యాడు. బొలాండ్ బౌలింగ్ బంతి ఎడ్జ్ తీసుకోగా.. కెమెరూన్ గ్రీన్ ఒంటి చేత్తో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టగా.. క్యాచ్‌పై అనుమానంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు నివేదించారు. పలు రీప్లైలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. చివరకు గిల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో శుభ్‌మన్ గిల్‌తోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
That's Cheating😡#Gill was not out,ball touched the ground. Why third empire was so much on hurry???#WTCFinal #WTC23Final @BCCI @ICC pic.twitter.com/JtBKEW0NqM
— Kuch Shabd (@KuchShabd29) June 10, 2023
అయితే గిల్‌ను ఔట్‌గా ప్రకటించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రీప్లైలో కెమెరూన్ గ్రీన్ బంతి నేలకు తాకిచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోందని.. ఔట్ ఎలా ఇచ్చాడని ప్రశ్నిస్తున్నారు. గిల్ ఔట్ అయిన వెంటనే #NOTOUT యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. శుభ్‌మన్ గిల్ ఔట్‌పై నిర్ణయం తీసుకుంటున్నప్పుడు థర్డ్ అంపైర్ ఇలా ఉన్నాడంటూ కళ్లకు గంతలు కట్టుకున్న ఫోటోను షేర్ చేశాడు. క్లియర్‌గా నాటౌట్ అని కనిపిస్తోందని ట్వీట్ చేశాడు. గిల్ ఔట్‌కు సంబంధించిన వీడియోలు క్రికెట్ ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తూ.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
Third umpire while making that decision of Shubman Gill.
Inconclusive evidence. When in doubt, it’s Not Out #WTC23Final pic.twitter.com/t567cvGjub
— Virender Sehwag (@virendersehwag) June 10, 2023
ప్రస్తుతం టీమిండియా 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఎదురీదుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (37), పుజారా (19) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో రోజు మొత్తం భారత్ బ్యాట్స్‌మెన్ ఆసీస్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. టార్గెట్‌ను ఛేదిస్తే.. ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు డబ్ల్యూటీసీ ట్రోఫీ భారత్ సొంతం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా డ్రా చేసుకున్నా చాలని అభిమానులు అనుకుంటున్నారు.
How is this out, fixed umpiring !!!!
How is this out ????
Bro, this is the final of the test championship, you dont even have conclusive evidence that it was out.
The ball clearly touched the ground and he got support from the grass !!!!#Gill #WTC23Final pic.twitter.com/DlbxvloIc7
— Ayush Gupta (@Beard_Gamer8) June 10, 2023
Also Read: Govt Jobs 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి భారీ రిక్రూట్మెంట్.. దరఖాస్తు వివరాలు ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook