Twitter Latest Update: ట్విట్టర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. యూట్యూబ్‌కు దీటుగా వీడియో యాప్!

Twitter Launches Video App: యూట్యూబ్‌కు దీటుగా ట్విట్టర్ రంగంలోకి దిగనుంది. త్వరలోనే వీడియో ప్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నహాలు చేస్తోంది. యూట్యూబ్ తరహాలోనే వీడియో క్రియేటర్లకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2023, 01:43 PM IST
Twitter Latest Update: ట్విట్టర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. యూట్యూబ్‌కు దీటుగా వీడియో యాప్!

Elon Musk Confirms Twitter will Launch Soon Video App: ప్రస్తుతం వీడియో ప్లాట్‌ఫామ్‌లలో యూట్యూబ్‌దే హావా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీడియోలు చూసేందుకు యూట్యూబ్‌నే ఆశ్రయిస్తున్నారు. కొన్ని లక్షల మంది యూట్యూబ్ ఛానెల్స్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. సినిమాలు, కోర్సులు, న్యూస్ ఇలా ఏ టూ జెడ్ ఏ సమాచారం కావాలన్నా యూట్యూబ్‌లోనే వెతుకున్నారు. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్‌కు పోటీగా ట్విట్టర్ కూడా ఓ వీడియో యాప్‌ను సిద్ధం చేస్తోంది. స్మార్ట్ టీవీల్లో కూడా ప్లే చేసే విధంగా రూపొందిస్తున్నారు. ఈ యాప్‌ను త్వరలో ప్రారంభించబోతున్నట్ ఎలన్ మస్క్ ధృవీకరించారు. 

గంట సేపు నిడివి ఉన్న వీడియోలను ట్విట్టర్‌లో చూసేంత ఓపిక తనకు లేదని.. స్మార్ట్ టీవీ కోసం ట్విట్టర్ వీడియో యాప్‌ను రూపొందించాలని ఎస్‌ఎమ్ రాబిన్సన్ అనే వ్యక్తి కోరాడు. ఇందుకు ఎలన్ మస్క్ రిప్లై ఇచ్చారు. మీ నిరీక్షణ త్వరలో ముగుస్తుందని సమాధానం ఇచ్చారు. ఇది అద్భుతమైన ఆలోచన అని రాబిన్సన్ అన్నారు. తాను యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకుని.. అక్కడ వీడియోలు చూడటం మానేసే రోజు త్వరలో వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

రాబోయే రోజుల్లో యూట్యూబ్‌కు దీటుగా ట్విట్టర్ వీడియో యాప్‌ను డెవలప్ చేస్తోంది. ట్విట్టర్ యాప్‌లో ఎలన్ మస్క్ నిరంతరం మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా వీడియోల కోసం కీలక మార్పులు తీసుకువచ్చారు. కంటెంట్ విషయంలో ఎన్నో మార్పులు చేశారు. త్వరలో ట్విట్టర్ వేదికగా క్రియేటర్స్ కోసం అడ్వర్టైజింగ్ సర్వీస్‌ను కూడా ప్రారంభిస్తామని ఇప్పటికే వెల్లడించింది. దీని ద్వారా ట్విటర్ వినియోగదారులకు యూట్యూబ్ తరహాలో ఆదాయం సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. పోస్టులకు కింద కామెంట్స్ బాక్స్‌ యాడ్స్‌ ప్రదర్శించి డబ్బులు సంపాదించుకోవచ్చు.

ఇటీవల ట్విట్టర్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ట్విట్టర్‌లో బ్లూటిక్ ఉన్న యూజర్లు 2 గంటల నిడివి గల వీడియోలను షేర్ చేయడానికి అనుమతి ఉంటుంది. వీడియోలు గరిష్టంగా 8 GB వరకు పరిమాణంలో ఉన్నా.. ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసుకోచ్చు.  ఈ అప్‌డేట్‌తో వినియోగదారులకు వివరణాత్మక వీడియో కంటెంట్‌ను అందించే అవకాశం ఉంటుంది.

Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News