Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన

Ram Charan-Upasana Blessed With Baby Girl: రామ్ చరణ్‌-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

Written by - Ashok Krindinti | Last Updated : Jun 20, 2023, 09:21 AM IST
Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన

Ram Charan - Upasana Blessed With Baby Girl: మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడో తరంలో వారసురాలు జన్మించింది. రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అయ్యారు. వీరికి పండంటి పాపాయి పుట్టింది. సోమవారం సాయంత్రం అపోలో ఆసుపత్రిలో డెలవరీ కోసం ఉపాసన చేరగా.. మంగళవారం తెల్లవారుజామున పాపాయి పుట్టినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు అభిమానుల్లో సంబరాలు మిన్నంటాయి. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. మెగా వారసురాలు వచ్చిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఉపాసన పండంటి పాపాయికి జన్మనివ్వడంతో ఇటు మెగా కుటుంబంలో.. అటు కామినేని కుటుంబంలో సంతోషం వ్యక్తం అవుతోంది. ఉపాసనతోపాటు రామ్ చరణ్‌ కూడా సోమవారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చాడు. తన కూతురిని చూసి మెగా పవర్ స్టార్ మురిపిపోయాడని సన్నిహితులు చెబుతున్నారు. మంగళవారం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అభినందనలు తెలపనున్నారు. 

Also Read: Pawan Kalyan News: మీకు రూ.10 లక్షలు ఆర్ధిక సాయం అందించే పూచీ నాదీ.. పవన్ వరాల జల్లు

గత కొద్దిరోజులుగా రామ్ చరణ్-ఉపాసన జంట ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మెగా ప్రిన్స్ వస్తాడా..? మెగా ప్రిన్సెస్ వస్తుందా..? అని గతకొద్ది రోజులుగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ముందుగా జూలైలో ఉపాసన డెలివరీ తేదీ ఉంటుందని అనుకోగా.. కానీ తరువాత జూన్ 20వ తేదీకి కన్ఫర్మ్ అయింది. సోమవారం సాయంత్రం ఉపాసన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మెగా అభిమానులు సంబరాలు, ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేసుకున్నారు. పండంటి పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలియగానే.. షూరు చేశారు.  

Also Read: KCR's Big Decision: రైతుల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News