Sourav Ganguly: ఒక్క టెస్టుకే వైస్ కెప్టెన్ చేస్తారా..? ఆ ప్లేయర్‌కు ఛాన్స్ ఇవ్వాల్సింది: సౌరవ్ గంగూలీ

Sourav Ganguly On Ajinkya Rahane: దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉన్న అజింక్యా రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం తిరిగి జట్టుతో స్థానం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించడంతో విండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు వైఎస్ కెప్టెన్‌గానూ ఎన్నికయ్యాడు. బీసీసీఐ నిర్ణయంపై తాజాగా గంగూలీ అభ్యంతరం వ్యక్తం చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 29, 2023, 06:12 PM IST
Sourav Ganguly: ఒక్క టెస్టుకే వైస్ కెప్టెన్ చేస్తారా..? ఆ ప్లేయర్‌కు ఛాన్స్ ఇవ్వాల్సింది: సౌరవ్ గంగూలీ

Sourav Ganguly On Ajinkya Rahane: వెస్టిండీస్‌ టూర్‌కు టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానేను తిరిగి నియమించడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది వెనుకడుగు అని తాను చెప్పను అని అన్నారు. 18 నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్న ఆటగాడికి ఒక టెస్టులో ఆడే అవకాశం ఇచ్చారని.. తరువాత వెంటనే వైస్ కెప్టెన్ చేశారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచన తనకు అర్థం కాలేదన్నారు. రవీంద్ర జడేజా రూపంలో మరో ఆప్షన్ అందుబాటులో ఉందని సూచించారు. టెస్ట్ జట్టులో కీలక ప్లేయర్‌గా జడేజా కొనసాగుతున్నాడని.. గ్యాప్ తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత ఒక ఆటగాడిని వైస్ కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయం తనకు అర్థం కాలేదని చెప్పారు. ఇలాంటి నిర్ణయాల తీసుకునేముందు బాగా ఆలోచించాలని గంగూలీ హితవు పలికారు. జట్టులో ఎంపిక హాట్‌గా కూల్‌గా ఉండకూడదని.. కొనసాగింపుగా ఉండాలన్నారు. 

ఐపీఎల్‌లో సూపర్ ఫామ్‌తో రహానే ఆకట్టుకోవడంతో టెస్టు జట్టులో చోటుదక్కింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆకట్టుకోవడంతో విండీస్ టూర్‌కు ఎంపికవ్వడంతోపాటు వైస్ కెప్టెన్ పదవి కూడా లభించింది. మరో సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా జట్టులో స్థానం కోల్పోగా.. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ వంటి యంగ్ ప్లేయర్లు జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. 

రహానే 2017 నుంచి 2021 వరకు టీమిండియాకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రహానే కొన్ని మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. రహానే కెప్టెన్సీలో టీమిండియా 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. సౌతాఫ్రికా పర్యటన తరువాత ఫామ్‌లో లేని కారణంగా సెలెక్టర్లు తొలగించారు.  

దాదాపు ఏడాదిపాటు జట్టుకు దూరంగా ఉన్న రహానే.. ఐపీఎల్ ద్వారా ఫామ్‌ను చాటుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైనా.. రహానే ఆకట్టుకున్నాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియా 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. జూలై 12వ తేదీ నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.

Also Read: Ambati Rayudu News: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు కీలక ప్రకటన  

Also Read: Nagarjuna New Car: కొత్త కారు కొనుగోలు చేసిన నాగార్జున.. ధర ఎంతో తెలుసా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News