AP Politics: ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ బీజీపీలతో కలిసి ఎన్నికల్లో అధికార పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ జాతీయ స్థాయిలో పరిణామాలు మరోలా ఉన్నాయి. ఈ పరిణామాలే ఇప్పుడు సమీకరణాల్ని మార్చనున్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై మద్దతు ఇస్తోంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరే విషయమై గతంలో బీజేపీ ఆహ్వానం అందించినా నిర్ద్వందంగా తిరస్కరించింది. తాజాగా మరోసారి ఎన్డీయేలో చేరాల్సిందిగా వైసీపీకు ఆహ్వానం అందింది. నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో 80 నిమిషాల సమావేశం, హోంమంత్రి అమిత్ షాతో 40 నిమిషాల భేటీలో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా సమాచారం.
జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం రెండు కీలకమైన బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. ఇందులో ఒకటి యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు కాగా రెండవది నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ బిల్లు. ఈ రెండు బిల్లులకు మద్దతివ్వాల్సింది ప్రధాని మోదీ కోరగా వైఎస్ జగన్ అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్డీఏలో చేరే విషయంలో మాత్రం నో చెప్పినట్టు సమాచారం. ఇప్పటి వరకూ అంశాలవారీగా ఇస్తున్న మద్దతును కొనసాగిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.
రాష్ట్రానికి రావల్సిన బకాయిలు, ప్రత్యేక నిధులు, పోలవరం నిధులు ఇతర రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని 2019 నుంచి వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కొనసాగిస్తున్నారు. ఇటీవలే రాష్ట్రానికి రావల్సిన బకాయిలు 21 వేల కోట్లు సాధించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసం కోసం మరో 10 వేల కోట్లు విడుదల చేయాలని ప్రధానిని వైఎస్ జగన్ కోరారు.
Also read: Ys Jagan-Ponguleti: సీఎం జగన్‌తో పొంగులేటి సమావేశం వెనుక కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook