Bro Movie: 'బ్రో'మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఫిక్స్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Bro Movie: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. అంతేకాకుండా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమా 'వినోదయ సిత్తం' అనే తమిళ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2023, 04:51 PM IST
Bro Movie: 'బ్రో'మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఫిక్స్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Bro Movie OTT Partner fix: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' మూవీ(Bro Movie) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్టర్ కమ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్‌లో దుమ్ముదులుపుతుంది. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తో దూసుకుపోతుంది. ఉదయం నుంచే పవర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలో పవన్, సాయి తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానుల్ని మెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా వినోదం, సెకెండ్ హాప్ అంతా భావోద్వేగాలతో నిండి ఉంటుంది.ఈ చిత్రం వినోదయ సిత్తం అనే తమిళ్ సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.

'బ్రో' సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడా ఓటీటీలోకి వస్తుందా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావడానికి 8 వారాల సమయం పడుతుంది. దీని ప్రకారం చూస్తే ఈ మూవీ సెప్టెంబరు చివరి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు. బ్రో సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించడంతోపాటు మాటలు కూడా రాశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రోహిణి, తనికెళ్ల భరణి, అలీ రెజా తదితరులు కీలకపాత్రల్లో నటించారు. 

Also Read: HBD Dhanush: ' కెప్టెన్ మిల్లర్'గా ధనుష్.. టీజర్ అదుర్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News