India Vs West Indies 1st T20 Toss and Playing 11: టీమిండియా 200వ టీ20 మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. విండీస్‌పై టెస్ట్, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. అదే ఊపును కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఇరు జట్ల మధ్య నేడు తొలిపోరు జరగనుంది. చివరి రెండు వన్డేలకు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా.. టీ20 జట్టును కూడా ముందుండి నడిపించనున్నాడు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ యువ జట్టును రెడీ చేస్తోంది. అటు విండీస్ కూడా బలంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన ప్లేయర్లు జట్టులో ఉండడంతో టీమిండియాకు సవాల్ విసిరే అవకాశం ఉంది. ట్రినిడాడ్‌లోని తరౌబాలోని బ్రయాన్ లారా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తరుఫున తిలక్ వర్మ, ముఖేష్ కుమార్‌లకు టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది.
"మేము బ్యాటింగ్ చేయబోతున్నాం. పిచ్ బ్యాటింగ్ అనుకూలించేలా కనిపిస్తుంది. భారత్ చాలా మంది స్పిన్నర్లను ఆడుతోంది. వారిని ఎలా ఎదుర్కొంటామో చూడాలి. మా ఆటగాళ్లు నమ్మకంగా ఉన్నారు. ఇది వ్యూహంలో పూర్తి మార్పు కాదు. భారీ స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తాం.. మేము పూర్తి శక్తితో బరిలోకి దిగుతున్నాం.." అని విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ తెలిపాడు.
మేం మళ్లీ ప్రపంచకప్ ఆడేందుకు ఇక్కడికి రావచ్చు. కొంతమంది ఆటగాళ్లకు ఇక్కడ ఆడే అవకాశం లభించే ఛాన్స్ ఉంది. మరోసారి ఇక్కడికి వచ్చే సమయానికి పూర్తి సంసిద్ధంగా ఉంటాం. నేను జరిగే విషయాలపైనే దృష్టిపెడతా.. ఉమ్రాన్, బిష్ణోయ్ ప్లేయింగ్ 11కు దూరమయ్యారు. ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతున్నాం." అని టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
తుది జట్లు ఇలా..
భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హిట్‌మేయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.
Also Read: Janjatiya Vikas: జీ మీడియా ఆధ్వర్యంలో ఈ నెల 5న 'జనజాతీయ వికాస్'.. వేడుకల్లో భారీగా పాల్గొనండి
Also Read: Tomato Price Today: టమాట ధరలకు మరింత రెక్కలు.. కేజీ ట్రిబుల్ సెంచరీ దిశగా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook