Case Filed Against Revanth Reddy: హైదరాబాద్ : తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మనోహర్ తెలిపారు. హైదరాబాద్ లో తాజాగా కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతల చేరిక కార్యక్రమం జరిగిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తమ పోలీసు సిబ్బందిని అవమానించేలా మాట్లాడినందుకు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు గుణవర్ధన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్ తెలిపారు.
రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డిలపై కూడా కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మనోహర్ తెలిపారు. జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు గుణవర్ధన్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ 313/2023, ప్రకారం సెక్షన్ 153, 609 ఐపిసి ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్పీ మీడియాకు వెల్లడించారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి నాగర్ కర్నూలు జిల్లాకే చెందిన పలువురు నేతల చేరికల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు దాసోహం అంటున్నారని.. ఆ పార్టీ నేతలు ఎలా చెబితే పోలీసులు అలా నడుచుకుంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు కానీ.. బీఆర్ఎస్ పార్టీకి అధికారం శాశ్వతం కాదన్నారు. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. అందుకే పోలీసు అధికారులకు ఇప్పుడే చెబుతున్నా.. రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతాం అని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి : Revanth Reddy: మేం అక్కడికి వస్తే.. నీ వీపు చింతపండు అవుతుంది.. మంత్రికి రేవంత్ రెడ్డి హెచ్చరిక..!
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, " బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీలో ఎవరెవరు ఏమేం చేశారో అన్నీ ఆ రెడ్ డైరీలో రాసి పెట్టుకుని మరీ మేం అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తాం " అని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా పోలీసులు స్పందిస్తూ రేవంత్ రెడ్డి తమను, తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని మండిపడుతున్నారు. పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రామగుండం పోలీసు కమిషనరేట్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సైతం స్పందిస్తూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఇది కూడా చదవండి : KTR Speech In Nizamabad: రేవంత్ రెడ్డిపై ప్రాసలతో సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి