PRC Hike For Cultural Sarathi Employees: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కారు దూకుడు పెంచింది. వరుసగా శుభవార్తలతో ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. తాగాగా మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు తీపికబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 30 శాతం వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా టీఎస్‌ఎస్ ఉద్యోగుల పీఆర్సీ పెంపునకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పీఆర్సీ 2020 ప్రకారం ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి.. 583 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన విషయం తెలిసిందే. ప్రతి నెల వీరికి రూ.24,514 జీతం చెల్లిస్తోంది ప్రభుత్వం. తాజాగా కళాకారుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే.. అదనంగా 30 శాతం వేతనం పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఒక్కొక్కరి జీతం రూ.7,300 వరకు పెరగనుంది. అంటే ఇక నుంచి నెలకు రూ.31,868 వరకు అందనుంది. ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలె రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాళ్ల పదవీ విరమణ వయసు 61 ఏళ్లు ఉండగా.. 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. అంతేకాకుండా రిటైర్మెంట్ చేసిన అంగన్‌వాడీ టీచర్లకు లక్ష రూపాయలు, మినీ అంగన్‌వాడీ టీచర్లతో పాటు హెల్పర్లకు రూ.50 వేల ఆర్థిక సాయం కూడా అందజేస్తామని వెల్లడించింది. పదవీ విరమణ తరువాత ఆసరా పెన్షన్లు అందజేస్తామని తెలిపింది.
Also Read: Central Govt Schemes: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ స్కీమ్ కింద అతి తక్కువ వడ్డీకే లోన్లు..!
Also Read: Minister Roja: రజనీకాంత్ స్టైల్లో మంత్రి రోజా డైలాగ్.. పవన్, చంద్రబాబుకు కౌంటర్.. అర్థమైందా రాజా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook