హృతిక్ రోషన్ 'సూపర్ 30' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

బాలీవుడ్ నటుడు హృతిక్ రోష‌న్ నటిస్తున్న చిత్రం 'సూపర్ 30'.

Last Updated : Sep 5, 2018, 05:16 PM IST
హృతిక్ రోషన్ 'సూపర్ 30' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

బాలీవుడ్ నటుడు హృతిక్ రోష‌న్ నటిస్తున్న చిత్రం 'సూపర్ 30'. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హృతిక్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. చివరిసారిగా కాబిల్ చిత్రంలో హృతిక్ నటించాడు. హృతిక్ చాలా కాలం తర్వాత గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం కావడంతో.. ఆయన అభిమానులు 'సూపర్ 30' మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా టీచర్స్ డే సందర్భంగా 'సూపర్ 30' మూవీ అధికారిక ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గ‌డ్డంతో డీ గ్లామ‌ర్ లుక్‌లో హృతిక్ కనిపిస్తున్నాడు. మ్యాథమేటిక్‌ ఫార్ములాస్‌తో పోస్టర్‌ను డిజైన్‌ చేసినట్టు కనిపిస్తోంది. పోస్టర్‌‌పై ‘రాజా కా బేటా రాజా నహీ బనేగా’, రాజా వహీ బనేగా జో హక్ దార్ హోగా' అనే పదాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

రిల‌యన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై తెరకెక్కిస్తున్న సూపర్ 30' మూవీని వికాస్ బాహ్ల్ తెరకెక్కిస్తున్నాడు. సూపర్ 30 పేరుతో జ‌న‌వ‌రి 25, 2019న విడుద‌ల కానుంది. కాగా 'సూప‌ర్ 30' రిలీజయ్యే రోజునే కంగనా రనౌత్‌ 'మణికర్ణిక', ఇమ్రాన్‌ హష్మి 'ఛీట్‌ ఇండియా'లు విడుద‌ల కానున్నాయి.

 

 

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

 

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

 

 

And the journey begins...#Super30

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

 

Trending News