స్వలింగ సంపర్కం ఇకపై నేరం కాదు.. సుప్రీం చారిత్రాత్మక తీర్పు

Last Updated : Sep 6, 2018, 05:56 PM IST
స్వలింగ సంపర్కం ఇకపై నేరం కాదు.. సుప్రీం చారిత్రాత్మక తీర్పు

ఇకపై మన దేశంలో స్వలింగ సంప‌ర్కం నేర‌ం కాబోదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. వివాదాస్పద ఐపీసీ సెక్షన్ 377పై కొద్దిసేపటి క్రితం సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఇకపై భారత్‌లో స్వలింగ సంపర్కం చట్టరీత్యా నేరం కాదని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పుని వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న స్వలింగ సంపర్క ప్రేమికులు సంబరాలు జరుపుకుంటున్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ వస్తోన్న ఐపీసీ సెక్షన్ 377ని రద్దు చేయాలని కోరుతూ  ఏళ్ల తరబడి సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తోన్న వారికి ఈ తీర్పు ఆనందాన్ని ఇచ్చింది.

Trending News