Reduce Bad Cholesterol: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొలెస్ట్రాల్ పెరగడం సర్వ సాధారణ సమస్యగా మారింది. ఎక్కువగా బయటి ఆహారాలను తినటం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలో శరీరంలో పెరుగుతున్నాయి. పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయి పట్ల సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది పెద్ద ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగగానే కొన్ని లక్షణాలు బహిర్గతమ్ అవుతుటాయి. ఇంట్లో ఉండే కొన్ని ఆహారాలను తినడం ద్వారా,పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించవచ్చు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం చాలా మంది ఎన్నో ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది ఫలితంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వెయ్యి రకాల గుండె జబ్బులు, పక్షవాతం మరియు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే ఒక మైనపు పదార్థం. కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే.. అది రక్త నాళాలకు అతుక్కుపోతుంది ఫలితంగా రక్తనాళాలను మూసుకొనిపోతాయి. దీని వలన రక్త ప్రసరణ తగ్గిపోతుంది.
Also Read: Lokesh Delhi Tour: తల్లితో ఢిల్లీకు హుటాహుటిన నారా లోకేశ్ పయనం, కారణాలేంటి
పెరుగుతున్న కొలెస్ట్రాల్ ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించి, వెంటనే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే పద్దతులను ప్రారంభించాలి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అలసట, బలహీనత మొదలైనవి కలుగుతుంటాయి. కొన్నిసార్లు కళ్ళ దగ్గర కొలెస్ట్రాల్ చేరడం వల్ల కళ్ళ చుట్టూ పసుపు రంగు మారిపోతుంది.కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల కంటి సిరల్లో అడ్డంకులు ఏర్పడటం జరుగుతుంది. ఈ పరిస్థితిని అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాలు
కొన్ని ఆహార పదార్థాలు శరీరంలో ఉండే అధిక కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి దోహాదపడతాయి. వీటిని తినడం ద్వారా పెరుగుతున్న కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు.జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. బ్లాక్, నేవీ, పింటో,డార్క్ రెడ్ రాజ్మా మరియు వైట్ రాజ్మా వంటి వాటిని తినడం వల్ల ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. రోజు 180 గ్రాముల వివిధ రకాల బీన్స్ తినడం ద్వారా పెరుగుతున్న కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు.బీన్స్‌లో ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
Also Read: Birth Certificate: ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్ చాలు గురూ.. అన్నింటికి సింగిల్ డాక్యుమెంట్‌గా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook