Palamuru Project Narlapur Pump House Inauguration: పాలమూరు ఎత్తిపోతల పథకం ఉమ్మడి పాలమూరు జిల్లా దశ, దిశను మార్చే ప్రాజెక్టు కానుందని తెలంగాణ సర్కారు ప్రకటించింది. దశలవారీగా పాలమూరు ఎత్తిపోతల పథకం పంపులను ప్రారంభిస్తూ పాలమూరు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం అని చెప్పిన తెలంగాణ సర్కారు.. నీటి విషయాలలో ఓనమాలు తెలియని వారు ఏదేదో దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడింది. పాలమూరు ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు సాగునీరు రానున్నదని.. అందుకే అన్ని గ్రామాల నుండి భారీఎత్తున జనం తరలిరావాలి అని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ చారిత్రక సందర్భంలో ఈ మహా ఘట్టంలో మనమంతా భాగస్వాములం కావాలి అని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ శతాబ్దంలోనే జరిగిన అద్భుతమైన నిర్మాణంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును అభివర్ణించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. 672 మీటర్ల ఎత్తుకు 145 మెగావాట్ల సామర్థ్యంగల పంపులు నాలుగు స్టేజిలలో 10 పంపులు ఎత్తిపోసే ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు అని అన్నారు. అటువంటి ప్రాజెక్టు ఈ రోజు పాలమూరుకు వచ్చిందని చెబుతూ, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది అని అడిగితే.. పాలమూరు ప్రాజెక్టు పేరు సమాధానంగా నిలిచిపోతుంది అని అన్నారు.
మనం సాధించుకున్న సొంత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో, మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తలపెట్టి పూర్తిచేసుకుంటున్న ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి అని.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాత్ర పోషించారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 27 వేల ఎకరాల భూసేకరణ, 5 రిజర్వాయర్ల నిర్మాణం, 4 పంపింగ్ స్టేషన్లు, సర్జిపూల్స్ నిర్మాణం, నాలుగు 420 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. గత పాలకుల తరహాలో సీఎం కేసీఆర్ వ్యవహరించి ఉంటే వందేళ్లయినా పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయ్యుండేది కాదు అని మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి : MLC Kavitha Slams Congress: కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు, సూటి ప్రశ్నలు
పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం సహాయం నిరాకరించినప్పటికీ, అనేక కేసులు, కుట్రలు ఉన్నప్పటికీ ఏడున్నరేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేసుకున్నాం అని చెప్పిన మంత్రి నిరంజన్ రెడ్డి.. రేపటి కార్యక్రమానికి హాజరవడమే కాకుండా తిరిగి వచ్చే క్రమంలో కలశాలలో కృష్ణమ్మ నీళ్లు తీసుకువచ్చి ఎల్లుండి 17 తేదీ నాడు ప్రతీ గ్రామంలో ఊరేగించి దేవాలయాల్లో అత్యద్భుతంగా కలశంలోని నీటితో దేవతామూర్తులను అభిషేకించే కార్యక్రమం నిర్వహించాలి అని పాలమూరు ప్రజలకు మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద వెట్ రన్ ప్రారంభించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి : CM Breakfast Scheme: సీఎం కేసీఆర్ మరో సూపర్ స్కీమ్.. రాష్ట్రంలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి