Harish Rao Comments On Revanth Reddy: గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పని చేస్తలేడని కొడంగల్‌లో ప్రజలు నరేందర్ రెడ్డిని గెలిపించుకున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. మన ప్రభుత్వం వచ్చాక కోస్గిలో 50 పడకలు, మద్దూరులో 30 పడకల ఆస్పత్రిని నిర్మించామని తెలిపారు. పదేళ్లలో రేవంత్ రెడ్డి ఒక్క దవాఖనా తీసుకురాలేదన్నారు. ఇప్పుడు మనకు మూడు ఆస్పత్రులు వచ్చాయన్నారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం కోస్గిలో 50 పడకల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
"కాంగ్రెస్ హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే వారు.. నేడు పోదాము పద బిడ్డ సర్కార్ దవాఖానకు అంటున్నారు. నరేందర్ రెడ్డి వచ్చాక ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చి దాహం తీర్చారు. రేవంత్ ఉంటే ఇంకా పదేండ్లు అయిన నీరు రాకపోయేది. కృష్ణా జలాలు నార్లపూర్ రిజర్వాయర్‌లోకి వచ్చాయి. ఇప్పుడు కూడా గెలిపించండి కృష్ణమ్మ నీళ్లతో మీ పాదాలు తడుపుతాము. సాగు నీరు కోసం పాలమూరు కాల్వలు తవ్వుతున్నాము. ఇప్పుడు మంచి నీరు వచ్చింది. తర్వాత సాగు నీరు వస్తది. దాంతో మనం వలస పోవాల్సిన అవసరం లేదు.
మూడు గంటల కరెంట్ ఇస్తే మూడు ఎకరాలు ఎలా పారుతాది. మూడు గంటల కరెంట్ కావాలి అంటే రేవంత్‌కు.. 24 గంటల కరెంట్, పాలమూరు నీరు కావాలి అంటే నరేందర్ రెడ్డికి ఓటు వేయాలి. రేవంత్‌కు ఓటేస్తే కైలాసంలో పెద్ద పాము మింగినట్లే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఆడపిల్ల పెండ్లికి పైసలు ఇస్తున్నరా..? అక్కడ మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తది. కర్ణాటకలో 600 పెన్షన్ ఇస్తున్నారు. మేము గెలిస్తే 4 వేలు ఇస్తాము అంటున్నారు.. గతంలో మీరే కదా అధికారంలో ఉన్నది అప్పుడు ఎందుకు ఇవ్వలేదు..? అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇవ్వడం చాతకాదు..కానీ ఇక్కడ ఇస్తారట. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు.." అని మంత్రి హరీష్ రావు విమర్శించారు.
రేవంత్‌ను తప్పు చేసినవు విచారణ జరపాల్సిందే అని సుప్రీంకోర్టు నిన్న తీర్పునిచ్చిందని.. విచారణ అయ్యేది ఖాయం.. జైలుకు పోయేది ఖాయమని జోస్యం చెప్పారు. నారాయణపేట్‌లో మెడికల్ కాలేజినీ ప్రారంభిస్తామన్నారు. మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపట్టారని తెలిపారు. ఆడ పిల్లల కోసం కాలేజీలు, యునివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే తమ మానిఫెస్టో వస్తుందని.. అందులో మహిళలకు శుభవార్త ఉంటుందన్నారు.
Also Read: MP Bandi Sanjay: ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్
Also Read: ICC World Cup 2023: వరల్డ్ కప్ ఆరంభానికి ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook