India Vs New Nealand Playing11 and Dream11 Team: ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్ జట్లను అలవోకగా చిత్తుచేశాం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లపై ఏ మాత్రం పోటీ లేకుండా విజయం సాధించాం.. కానీ ఈసారి టీమిండియాకు బలమైన ప్రత్యర్థి ఎదురుకానుంది. ఈ మెగాటోర్నీలో వరుసగా నాలుగు విజయాలు సాధించి జోరు మీద ఉన్న న్యూజిలాండ్‌తో నేడు భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సెమీస్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్తుంది. రెండూ జట్ల ఖాతాలో 8 పాయింట్లు ఉండగా.. నెట్‌రన్ రేట్ ఎక్కువ ఉండడంతో కివీస్ టాప్ ప్లేస్‌లో ఉంది. టీమిండియా రెండోస్థానంలో ఉంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ధర్మశాల వేదికగా టాప్-2 జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా దూరమవ్వడంతో భారత తుదిజట్టులోకి ఎవరు వస్తారు..? న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుంది..? పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
పిచ్, వెదర్ రిపోర్ట్ ఇలా..
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు చక్కగా సహకరిస్తుంది. మ్యాచ్ మధ్యలో స్పిన్నర్లు కూడా పట్టు సాధిస్తారు. మేఘావృతమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ సవాలుగా ఉంటుంది. ఈ పిచ్‌పై టఫ్ ఫైట్ ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. నేడు ధర్మశాలలో వాతావరణం మేఘావృతమై మేఘావృతమై ఉంటుంది. 20 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్, తేమ స్థాయి 62 శాతం ఉంటుంది. గాలి వేగం గంటకు 10 కి.మీగా ఉంటుంది.
స్ట్రీమింగ్ వివరాలు..
==> వేదిక: హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
==> సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి ప్రారంభం (టాస్ టైమ్)
==> స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్‌సైట్, యాప్
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్/సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
IND vs NZ డ్రీమ్11 ప్రిడిక్షన్ టిప్స్..
వికెట్ కీపర్లు: డెవాన్ కాన్వే, కేఎల్ రాహుల్
బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, డార్లీ మిచెల్, శ్రేయాస్ అయ్యర్
ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్
Also Read: Lava Blaze Pro 5G Price: బంఫర్ ఆఫర్ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook