Telangana Elections 2023: సీఎం కేసీఆర్ ఎన్ని చెప్పిన ప్రజలు నమ్మరు: రేణుకా చౌదరి

తెలంగాణలో ఎన్నికల సమరం జోరుగా సాగుతుంది. నాయకులు ప్రచారాల్లో పాల్గొంటూ.. విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి గాంధీభవన్ లో మాట్లాడారు. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2023, 04:12 PM IST
Telangana Elections 2023: సీఎం కేసీఆర్ ఎన్ని చెప్పిన ప్రజలు నమ్మరు: రేణుకా చౌదరి

Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే! బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకూడా ఇటీవల అభ్యర్థులను ప్రకటించి.. రాహుల్ గాంధీ వంటి జాతీయ నాయకులతో ప్రచారం కొనసాగుతుంది. ఇక బీజేపీ పార్టీ ప్రచారం ప్రారంభించిది. 

ఎన్నికల ప్రచారంలో ఎత్తుకు పై ఎత్తులు.. విమర్శలకు ప్రతి విమర్శలతో నాయకులు ముందుకు సాగుతున్నారు. మాజీ భారత పార్లమెంటు సభ్యురాలు, మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి గాంధీభవన్ లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రేణుకా చౌదరి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల హడావిడి లో సీఎం ప్రదక్షిణ చేస్తూ.. చేతులెత్తి ప్రజలను ఓట్లు అడుక్కునటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ సీఎం కేసీఆర్ కానీ మహిళలు కోసం ఏం చేశారాని..? మీకు ప్రజలు ఓట్లు వేయాలి..? అని ప్రశ్నించారు. 

తెలంగాణ జిల్లాలో మహిళలు రక్షణ కల్పించలేని మీకు ఎందుకు ఓటు వేయాలి..? 18 ఏళ్ళ లోపు అమ్మాయిలకు వివాహం చేయటం చట్ట విరుద్ధం.. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి చట్టలకు విరుద్ధంగా 18 ఏళ్ళ లోపు అమ్మాయిలకు వివాహాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ హాయాంలో ఆడపిల్లలకు చదువు కోసం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వాగ్దానం చేసిన కేజీ to పీజీ ఉచిత విద్యా హామీ ఏమైందని..? ఆ ఊసే తెలంగాణలో లేదని రేణుకా చౌదరి మండిపడ్డారు. 

తెలంగాణ రాష్ట్రంలో   కనీస అవసరాలు లేకపోవడం వల్ల మధ్య లోనే ఆడపిల్లలు చదువు ఆపేస్తున్నారు. తెలంగాణలో ఎవరిపైన బాగుపడ్డారు అంటే కేవలం ఎమ్మెల్సీ కవిత ఒక్కరు.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే బాగుపడ్డారు. మొదటి కాబినెట్ లో ఒక్క మహిళా లేదు. రెండో సరి కాబినెట్ లో అవకాశం కల్పించారు. ఒక మహిళా అభిప్రాయంతో సామజిక న్యాయం జరుగుతుందని మేం ఆలోచన చేశాం. బంగారం తల్లి కాదు కదా.. బంగారం లేదు. ఇపుడు తెలంగాణలో పుట్టబోయే ఒక్కో ఆడబిడ్డ మీద 5 లక్షలు అప్పు ఉంది. ఇతర రాష్ట్ర రైతుల కూడా పైసా ఇవ్వలేదు. 

Also Read: Chandrababu Case: చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై ఇవాళ విచారణ, ఊరట లభించేనా

2019 ఎన్నికల్లో భర్త చనిపోయిన మహిళా లకి పావలా వడ్డీకే రుణం అన్నారు.. అదెటుపోయింది..? నిత్యావసర వస్తువులు ధరలు, గ్యాస్ ధర పెరగడంతో మహిళలు ఇబ్బంది. మహిళలను ఈ విధంగా మోసం చేసిన మీకు ఓటు వెయ్యాలా..? చేతగాని అసమర్ధత ప్రభుత్వం ఇది.18 సంవత్సరాలనుండి ఓటు హక్కు కల్పించింది, స్థానిక సంస్థల్లో 33 శాతం ఉన్నా మహిళా రిజర్వేషన్ ను 50 శాటానికి పెంచింది కాంగ్రెస్. కేసీఆర్ ఎన్నికల ప్రచారాల్లో ఎన్ని చెప్పినా.. మభ్యపెట్టాలని చూసిన  ప్రజలు నమ్మరు. టికెట్ల కేటాయింపులో కమ్మ , బీసీ సామజిక వర్గాలకు ఇంకా ప్రాధాన్యత ఇవ్వాల్సిందని" రేణుకా చౌదరి సూచించారు. 

Also Read: Vizianagaram Train Accident Updates: రైల్వే శాఖ గుణపాఠం నేర్చుకోదా, ఆటో సిగ్నలింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

 

Trending News