Ind vs Nz: ప్రపంచకప్ 2023లో ఇండియా సెమీపైనల్ ప్రత్యర్ది న్యూజిలాండ్గా దాదాపుగా నిర్ధారణైంది. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించినా నాకౌట్ దశలో అంత సులభం కాదన్పిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఉన్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఆ వివరాలు తెలుసుకుందాం..
ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఆడిన 8 మ్యాచ్‌లు గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో తలపడనుంది. అది కూడా గెలిస్తే 18 పాయింట్లు దక్కుతాయి. ఒక సెమీపైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా అంటే 2,3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఖరారైంది. రెండవది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ కావచ్చు. ఇదే ఇప్పుడు ఇండియాకు అంత సులభమార్గం కాదేమో అన్పిస్తోంది. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను ఇండియా మట్టి కరిపించినా దాదాపు 20 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతమది. ఎందుకంటే లీగ్ దశలో ప్రపంచకప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇండియా అప్పటి వరకూ గెలవలేదు. అంటే న్యూజిలాండ్‌దే పైచేయి ఉంది. ఇప్పుడు తిరిగి నాకౌట్ దశలో న్యూజిలాండ్‌తో తలపడటం ఇండియాకు ఇబ్బందే కావచ్చంటున్నారు.
ఐసీసీ నాకౌట్ దశలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడుసార్లు తలపడ్డాయి. 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీపైనల్ మ్యాచ్‌లో కూడా కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కూడా న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
అంటే నాకౌట్ దశలో ఇండియా మూడు సార్లు న్యూజిలాండ్ చేతిలో పరాభవమే ఎదుర్కొంది. అందుకే ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ కివీస్‌తో అనగానే ఆందోళన అధికమైంది. ఇక సెమీపైనల్ జరగనున్న ముంబై వాంఖడే స్డేడియం ఛేజింగ్‌కు అంత సులభం కాదు. మ్యాచ్ గడిచేకొద్దగీ బౌలర్లకు అనుకూలంగా మారుతుంది. లీగ్ దశలో ఈ పిచ్‌పై నాలుగు మ్యాచ్‌లు జరిగితే మూడు సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది.
Also read: PAK Vs ENG Updates: పాక్‌కు గట్టి ఝలక్ ఇచ్చిన ఇంగ్లాండ్.. టాస్ ఓటమితోనే దయాది ఇంటిముఖం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook