Midhili Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది. ఇది కాస్తా తీవ్ర వాయుగుండమైంది. వచ్చే 24 గంటల్లో తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు మాల్దీవ్స్ దేశం సూచించిన మిథిలీగా నామకరణం చేశారు.
బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది. ముందు అల్పపీడనం తరువాత వాయుగుండంమై అనంతరం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇక రానున్న 24 గంటల్లో తుపానుగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ తుపానుకు మాల్దీవులు దేశం సూచించిన మిథిలీ పేరు పెట్టినట్టు ఐఎండీ వెల్లడించింది. శనివారం ఉదయం బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా, మోంగ్లా మధ్య తీరం దాటవచ్చు.
ఇవాళ ఉదయానికి తుపాను వ్యవస్త విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 390 కిలోమీటర్లు, పారాదీప్‌కు 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపానుగా మారి తీరం దాటే సమయంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. అదే సమయంలో ఒడిశా, ఉత్తరాంధ్రతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.
అయితే ఏపీ, ఒడిశాకు తుపాను ముప్పు తప్పినట్టేనని వాతావరణ శాఖ వివరించింది. వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది.
Also read: Heavy Rains: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook