Telangana Election 2023 Exit Poll: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..తెలంగాణ కింగ్‌ ఎవరంటే..

Telangana Election 2023 Exit Poll: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమరం ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ వైపు మళ్ళింది. ఎలక్షన్ల ముందు కొన్ని ప్రధాన సర్వేలు హడావిడి చేస్తే.. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఎంత సందడి చేస్తాయో అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి అదృష్టం వరించబోతుందో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా తెలుసుకుందాం.

Last Updated : Nov 30, 2023, 06:19 PM IST
Telangana Election 2023 Exit Poll: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..తెలంగాణ కింగ్‌ ఎవరంటే..

 

Telangana Election 2023 Exit Poll: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలో భద్రమైంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎవరు అధికారంలోకి వస్తారు..? బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? బీజేపీ పుంజుకుంటుందా..? అనేది ఉత్కంఠగా మారింది. ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి.

తెలంగాణ ఎన్నికల్లో ఆత్మసాక్షి నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో బీఆర్ఎస్‌కు 58-63 సీట్లు, కాంగ్రెస్ 48-51 సీట్లు, బీజేపీ 7-8, ఎంఐఎం 6-07, ఇతరులు 1-02 సీట్లు గెలుచుకుం

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం: ఆరా సర్వే

తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చని ఆరా సర్వేలో వెల్లడైంది. అధికార BRSకు 41-49 సీట్లు (39.58% ఓట్లు) మాత్రమే రావచ్చని పేర్కొంది. ఇక ప్రస్తుత ప్రతిపక్షంలోని కాంగ్రెస్ ఏకంగా 58-67 (41.13% ఓట్లు) గెలుస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 5-7 సీట్లు రావచ్చని వెల్లడించింది. ఎంఐఎం 7 గెలిచే ఉందని పేర్కొంది. ఇతరులకు 2 చోట్ల రావచ్చని అంచనా వేసింది.

 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

కామారెడ్డి ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితం రాబోతోందని ఆరామస్తాన్ సర్వే వెల్లడించింది. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇక్కడ ఓడిపోవచ్చని వీరి సర్వేలో వెల్లడైంది. బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి గెలిచే అవకాశం ఉందని తెలిపింది.

కొల్లాపూర్లో బర్రెలక్కకు ఎన్ని వేల ఓట్లంటే.. సర్వే

కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష (బర్రెలక్క) కు 15 వేల ఓట్లు రావచ్చని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. బర్రెలక్క గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తారని ఈ సర్వే వెల్లడించింది.

చాణక్య నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో భాగంగా బీఆర్‌ఎస్‌ 21-31 సీట్లు మాత్రమే రావచ్చని పేర్కొంది. ఇదే సర్వే కాంగ్రెస్‌కు 67-78 సీట్లు, బీజేపీకి 6-9 సీట్లు, ఎంఐఎం  6-7 సీట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్లో ఏ పార్టీకి ఎన్నంటే..?

AARAA ప్రీ పోల్ సర్వేలో జిల్లాల వారీగా పార్టీలు గెలుచుకునే స్థానాల జాబితా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 15 నియోజకవర్గాల్లో BRS: 5-6, INC: 1-2, BJP: 1, MIM: 6-7 గెలుచుకుంటుందని అంచనా వేసింది. శివారు నియోజకవర్గమైన మహేశ్వరంలో BRSకు గట్టి పోటీ ఉంటుందని వెల్లడించింది.

మాకు 70కి పైగా సీట్లు వస్తాయ్: KTR

తెలంగాణలో 2018 ఫలితాలు రిపీట్ అవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అప్పుడు కూడా సర్వేలన్నీ ఇలానే చెప్పాయని అన్నారు. డిసెంబర్ 3న తాము అధికారంలోకి వస్తామని, తమకు 70కి పైగా సీట్లు వస్తాయన్నారు. తాము 88కి పైగా సీట్లు వస్తాయని అనుకున్నా.. కొన్ని చోట్ల తప్పిదాల వల్ల మెజార్టీ కొంచెం తగ్గుతుందని KTR చెప్పారు.

 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News