CM Jagan Review Meeting on Cyclone Michaung: ప్రస్తుతం మిచౌంగ్ తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారిందని.. తుపాను వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మిచౌంగ్ తుపాను పరిస్థితులపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులంతా సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలని సూచించారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని చెప్పారు. కాస్త డబ్బులు ఎక్కువైన పర్వాలేదని.. మంచి సాయం అందలన్నారు. ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలని.. దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కానీ.. క్యాంపుల నుంచి ప్రజలను తిరిగి వెళ్తున్న సందర్బంలో కానీ వారికి అందజేయాల్సిన సహాయం వారికి ఇవ్వాలన్నారు.
రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదని ఆదేశించారు సీఎం జగన్. పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని చెప్పారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్నదాతలు అధైర్యపడాల్సిన పనిలేదని.. ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కీలక ప్రకటన చేశారు. అన్నిరకాలుగా రైతులకు తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. 80 శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకూ అన్నిరకాలుగా సిద్ధంకావాలని అధికారులకు చెప్పారు.
'యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి. దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దరించండి. రోడ్లను నిర్మించడం ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి..' అని సీఎం ఆదేశించారు. అధికారులంతా బాగానే పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు. చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తామన్నారు. వాలంటీర్ల దగ్గర నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుందన్నారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
Also Read: Viral News: దిమిలి గ్రామంలో జరిగే బురద జాతర ప్రత్యేకత..ఈ జాతర వెనుక ఉన్న పెద్ద సైన్స్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
CM YS Jagan Mohan Reddy: ఏపీపై మిచౌంగ్ తుపాను భారీ ఎఫెక్ట్.. సీఎం జగన్ కీలక ప్రకటన