TS Cabinet Meeting: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్ర.. తొలి కేబినెట్ సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి మార్క్

CM Revanth Reddy Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి తొలి కేబినెట్ సమావేశం వాడీవేడిగా సాగింది. విద్యుత్ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహ వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యుత్ శాఖపై రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. రాజీనామా చేసిన ట్రాన్స్ కో, జెన్‌ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు సమావేశానికి హాజరు కావాలని ఆదేశించరు.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 8, 2023, 06:37 AM IST
TS Cabinet Meeting: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్ర.. తొలి కేబినెట్ సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి మార్క్

CM Revanth Reddy Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. తన ఛాంబర్‌లో పూజలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత వెంటనే తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లో ప్రభుత్వ అధికారులతో విద్యుత్‌పై  సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్  అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాదనం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చీకటి వస్తుందని తెలంగాణ సమాజానికి చెప్పే కుట్ర అని.. విద్యుత్‌లో 85 వేల కోట్ల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసిందన్నారు. 

సోమవారం నుంచి విద్యుత్ పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు తెగబడ్డారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. విద్యుత్ కొనుగోళ్లపై పూర్తి వివరాలుతో రావాలని  అధికారులకు ఆదేశించారు. సీఎండీల రాజీనామాలు ఆమోదించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం విద్యుత్‌పై రివ్యూ మీటింగ్ అందరు రావాలన్నారు. విద్యుత్‌పై నేడు రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమి అనంతరం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను ఆమోదించవద్దని.. శుక్రవారం జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో జరిగిన లావాదేవీలపై ట్రాన్స్ కో సీఎండీ వివరణను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 24 గంటల కరెంటు ఇస్తామని.. ఇందుకోసం అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు లేకుండా విద్యుత్ కొనుగోలు జరిగిందన్నారు. శుక్రవారం విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులతో సీఎం రివ్యూ ఉంటుందన్నారు. విద్యుత్ అంతరాయం జరుగకుండా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని చెప్పారు. 

ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం 4.20 గంటలకు సచివాలయం చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు ప్రధాన ద్వారం వద్ద సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాలతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘనం స్వాగతం పలికారు. ప్రధాన ద్వారం వద్ద నుంచి అధికారులు అందరికీ అభివాదం చేస్తూ రేవంత్ రెడ్డి కాలినడకన సాయంత్రం 4.30 నిమిషాలకు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం లోపలికి ప్రవేశించగానే వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో తన శ్రీమతి గీతతో కలసి సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సాయంత్రం 4.46 నిమిషాలకు తన అధికార ఆసనంపై ఆసీనులయ్యారు. అనంతరం వేద పండితులు సిఎం దంపతులకు ఆశీర్వచనం చేశారు.  

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, DGP రవీ గుప్తాలతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సెక్రటేరియట్ అధికారులు, ప్రజాప్రతిధులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరిగింది. 

Also Read:  New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..

Also Read:  CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News