Gaza Ceasefire: ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధంపై ప్రపంచమంతా ఓ వైపుంటే అమెరికా, బ్రిటన్ దేశాలు మాత్రం మరోవైపుంటున్నాయి. ప్రపంచశాంతి, ప్రజల ప్రాణాలకంటే తమ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నట్టు కన్పిస్తోంది. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రవేశపెట్టిన కాల్పుల విరమణ తీర్మానానికి ఆటంకం కల్గించాయి. అమెరికా నో చెబితే బ్రిటన్ ఓటింగ్ దూరంగా ఉండి పరోక్షంగా ఇజ్రాయిల్‌కు సహకరించింది.
గాజాపై ఇజ్రాయిల్ దాడుల నేపధ్యంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం కారణంతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. గాజాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోంది. అటు బ్రిటన్, అమెరికా దేశాలు కూడా గాజా పరిస్థితిపై పైకి సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. గాజాలో శాంతి నెలకొల్పాలని ప్రకటనలు చేస్తున్నాయి. వాస్తవంలో వచ్చేసరికి అసలు వైఖరి ప్రదర్శిస్తున్నాయి. గాజాలో తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటూ శుక్రవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా నో చెప్పింది. యుద్ధంతో అతలాకుతలమౌతున్న గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని, బందీలను హమాస్ మిలిటెంట్లు బేషరతుగా విడిచిపెట్టాలని యూఏఈ చేసిన ప్రతిపాదనకు 90 సభ్యదేశాలు మద్దతు పలికాయి.
భద్రతా మండలిలో 15 దేశాలకు 13 దేశాలు బలపర్చాయి. ఇక బ్రిటన్ ఓటింగ్ దూరంగా ఉండి ఇజ్రాయిల్‌కు పరోక్షంగా సహకరించింది. అమెరికా నేరుగా నో చెప్పింది. తనకున్న వీటో అధికారంతో యూఏఈ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను అడ్డుకుంది. హమాస్ పుంజుకునేందుకు కాల్పుల విరమణ ఉపయోగపడుతుందని అమెరికా వాదిస్తోంది. అమెరికా ఈ తీర్మానాన్ని అడ్డుకోవడంపై యూఏఈ విచారం వ్యక్తం చేసింది.
Also read: Sri Lanka Power Cut: అంధకారంలో శ్రీలంక.. దేశ మొత్తం కరెంట్ కట్>
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook