Salary Hike For AP Volunteers: ఏపీలో వాలంటీర్లకు సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా తీపి కబురు వచ్చింది. గ్రామ, వార్డు వాలంటీర్లకు జీతాలు పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పుట్టినరోజు కానుకగా వాలంటీర్ల జీతాలు పెంచుతున్నామన్నారు. జనవరి 1వ తేదీ నుంచి అదనంగా రూ.750 పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం వాలంటీర్లకు గౌరవ వేతనంగా ప్రభుత్వం రూ.5 వేలు అందజేస్తున్న విషయం తెలిసిందే. కొత్త ఏడాదిలో ఈ 5 వేలకు అదనంగా రూ.750 అందుకోనున్నారు.
రానున్న రోజుల్లో వాలంటీర్లకు మరింత మంచి చేస్తామన్నారు మంత్రి కారుమూరి. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దోచుకునేందునే జగన్ పాలన పోవాలని అంటున్నారని మండిపడ్దారు. తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలమ్మను జగన్ ఎప్పుడు గౌరవంగా చూస్తున్నారని అన్నారు. వాలంటీర్లు మరింత పగడ్బందీగా సేవలు అందించాలనే ఉద్దేశంతో జీతాలు పెంచుతున్నామన్నారు.
తమ ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు. విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. లక్షలమందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. మన రాష్ట్రం జీడీపీలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.
మరోవైపు ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలను వైసీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కేక్ కట్ చేస్తూ.. ముఖ్యమంత్రికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. హ్యాపీ బర్త్ డే సీఎం జగన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook