Budh Gochar 2023 effect: తెలివితేటలకు కారకుడైన బుధుడు మరో నాలుగు రోజుల్లో రాశిని మార్చనున్నాడు. డిసెంబర్ 28 ఉదయం 10:55 గంటలకు బుధుడు ధనుస్సు రాశి నుండి తిరోగమన స్థితిలో వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో మెర్క్యూరీ పది రోజులపాటు ఉండనున్నాడు. అనంతరం బుధుడు వృశ్చిక రాశిని విడిచిపెట్టి ధనస్సు రాశిలోకి వెళ్లనున్నాడు. ఏ వ్యక్తి జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. బుధుడు సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
కుంభ రాశి
బుధుడు సంచారం కుంభరాశి వారికి సుఖసంతోషాలను ఇస్తుంది. మీకు ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారం వృద్ది చెందుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. జాబ్ చేసేవారి జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు లక్ కలిసి వస్తుంది.
మకరరాశి
మెర్క్యురీ రాశి మార్పు మకరరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఇదే రాశిలో శనిదేవుడి సాడే సతి జరుగుతోంది. దీని వల్ల బుధుడితోపాటు శనిదేవుడు ఆశీస్సులు కూడా ఉంటాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. బిజినెస్ చేసవారు భారీగా లాభపడతారు. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు.
మీనరాశి
మెర్క్యూరీ రాశి మార్పు మీనరాశి వారికి బాగుంటుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను ఇస్తాయి. మీరు డబ్బును ఆదా చేస్తారు. ఆగిపోయిన ప్రమోషన్ లభిస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను గడుపుతారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కెరీర్ బాగుంటుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది.
Also Read: Rasi Phalalu: డిసెంబర్ చివరి వార ఫలాలు..ఈ వీక్ పై చేయి ఈ రాశుల వారిదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook