Mercury Transit 2024: జ్యోతిష శాస్త్రంలో బుధ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాకుమారుడుగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం కూడా ఏదో ఒక ప్రత్యేక సమయంలో రాశి సంచారం చేస్తుంది. ఈ రాశి సంచారం కారణంగా అన్ని రాశుల వారు ప్రభావితం అవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బుధ గ్రహం ఫిబ్రవరి మొదటి వారంలో రాశి సంచారం చేయబోతోంది. ఫిబ్రవరి 1 గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు బుధుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాష్ట్రాల వారిపై ప్రత్యేక ప్రభావం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో వారు అదృష్టవంతులు కావడమే కాకుండా.. జీవితంలో ఉన్నత శిఖరాలకు కూడా ఎదుగుతారు. అయితే ఈ బుధ గ్రహ సంచారం ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తులారాశి:
బుధ గ్రహ సంచారంతో తులా రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తు కోసం వేసే ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో ప్రయాణాలు చేయవచ్చు. అంతేకాకుండా వీరికి ప్రమోషన్స్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి.. తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోయిన వారికి ఈ సమయంలో లాభాలు రావడం ప్రారంభం అవుతాయి.
కన్యారాశి:
బుధ గ్రహ సంచారంతో కన్యా రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి.. వ్యాపారాలు డబ్బులు పొందుతారు. ఇంతకుముందు ఉన్న అన్ని సమస్యలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయాల్లో పనులు మారే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కుటుంబ జీవితం గడుపుతున్న వారికి భాగస్వామి నుంచి పూర్తి సపోర్టు లభిస్తుంది.
మకర రాశి:
బుధ గ్రహ సంచారం మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షల్లో రానివ్వగలుగుతారు. దీంతోపాటు వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి.. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter