Ration Cards: తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో కార్డులేనివారిలో ఆందోళన పెరిగింది. ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల్లో కూడా చాలామంది రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ పథకాల లబ్దికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో పథకాలు తమకు అమలు కావేమో అనే ఆందోళనలో ఉన్నారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అర్హులైనవారికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పథకాల అమలుకు కృషి చేస్తామని గతంలో అన్నారు. ఆరోగ్య శ్రీ కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా జారీ చేయాలని భావిస్తున్నారట.
ఇదీ చదవండి: 19 లక్షల ఎకరాలకు రైతు బంధు కట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..
అయితే, కీలక గ్యారెంటీలు రూ.500 సిలిండర్, 200 యూనిట్ల కు ఉచిత కరెంటుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేస్తున్నారు. గత పదేళ్లుగా రేషన్ కార్డు జారీలు అంతగా చేయకపోవడంతో చాలామంది ప్రజలు కొత్తరేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. తమకు గ్యారెంటీలు అమలు కావేమో అని ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల కేవైసీ కూడా ఫిబ్రవరి 29 వరకు పొడిగించారు. ఆ తర్వాత మార్చి నుంచి కొత్తరేషన్ కార్డుల మంజూరు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, కేవైసీ చేయకపోతే కార్డులో వారి పేర్లను తొలగించనున్నారు. కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు అమలు చేస్తారనే ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అర్హులైనవారికి కచ్చితంగా అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు. అంటే మార్చి నుంచి కొత్తరేషన్ కార్డులు మంజూరు చేయవచ్చని అంచనావేస్తున్నారు.
ఇదీ చదవండి: సింగోటం రాము హత్య కేసు..తల్లి కుతుర్ల జల్సాల వీడియోస్ వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook