Lagam: రాజేంద్రప్రసాద్ తో సప్తగిరి.. మాట ముచ్చటతో లగ్గం !!!

Rajendra Prasad: కామెడీ సినిమాలు అంతే పెట్టింది పేరు రాజేంద్రప్రసాద్. ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే చాలు ఫ్యామిలీ మొత్తం సినిమా హాళ్లకు వెళ్లి కడుపుబ్బ నవ్వుకోవచ్చు అని ఫిక్స్ అయిపోయేవారు. అలాంటి రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం ఈ తరం కమెడియన్ సప్తగిరి తో ఒక సినిమాతో మనం ముందుకు రానన్నారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2024, 07:00 AM IST
Lagam: రాజేంద్రప్రసాద్ తో సప్తగిరి.. మాట ముచ్చటతో లగ్గం !!!

Satagiri: కామెడీ సినిమాలకు పెట్టింది పేరు రాజేంద్రప్రసాద్. ఆయన సినిమాలను చూస్తే చాలు మనకున్న బాధలన్నీ మర్చిపోతాము. అంతలా అప్పట్లో వచ్చిన ఆయన సినిమాలు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాలనే కాకుండా ఎన్నో మంచి సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మరింత పేరు తెచ్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మన ఈ నటుడు లగ్గం అనే చిత్రంతో రానున్నాడు. ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే రాజేంద్రప్రసాద్ తో పాటు ఈ చిత్రంలో ఈ తరం కామెడీ యాక్టర్ సప్తగిరి కూడా నటిస్తున్నాడు.
సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కి భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాకి రచన కూడా రమేష్ చేయడం విశేషం.
 
ఫిబ్రవరి 5 న కార్యక్రమాలతో మొదలైన ఈ  "లగ్గం"  శరవేగంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 23 నుండి వరపూజతో  రెండవ షెడ్యూల్  ప్రారంభం కానుంది అని తెలిపాడు ఈ చిత్ర నిర్మాతలు. మొదటి షెడ్యూల్ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. కాగా ఈ షెడ్యూల్లో రాజేంద్రప్రసాద్ అలానే సప్తగిరి మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారని ఆ సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

రాజేంద్రప్రసాద్, రోహిణి, సాయి రోనాక్, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి వంటి సీనియర్  నటులు నటిస్తున్న ఈ చిత్రం కుటుంబ విలువలను, మర్చిపోతున్న సాంప్రదాయాలను, సంస్కృతిని మళ్లీ గుర్తుచేసే... అరుదైన చిత్రంగా తెరకేక్కబోతుంది అని వినికిడి.
ఈ సినిమాకి బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్.
ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా  బేబీ చిత్ర కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..

Read More: Praveen IPS: విడుదలైన ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్.. ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News