Hari Hara Veera Mallu: గమ్యం సినిమాతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్. మొదటి సినిమాతోనే ఈ డైరెక్టర్ అద్భుతమైన చిత్రాలు అందివ్వగలరు అని ప్రేక్షకుల మదిలో ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత ఈ డైరెక్టర్ తీసిన వేదం చిత్రం కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల దగ్గర నుంచి అలానే సినిమా విశ్లేషకుల దగ్గర నుంచి మంచి రివ్యూలు అందుకుంది.
ఆ తరువాత కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి ఇలాంటి సూపర్ హిట్లు అందించి మరింత పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ ఒక కేసులో ఇరుక్కోవడం అందరి దృష్టిని అతని వైపు తిప్పింది.
అసలు విషయానికి వస్తే రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసు కొద్దిరోజుల ముందు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసు రెండు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. పోలీసులు విచారణ జరుగుతూ ఉండగా ఇందులో ఒక్కో పేరు బయటకి వస్తూ ఉంది. తాజాగా ఈ లిస్టులో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు కూడా వచ్చి చేరింది. ఆరోజు రాడిసన్ హోటల్ లో జరిగిన పార్టీకి టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీస్ హాజరయ్యిన సంగతి తెలిసిందే. అలా అటెండ్ అయిన వారిలో దర్శకుడు క్రిష్ కూడా ఉన్నారట. ఇప్పుడు ఇదే పెద్ద హట్ టాపిక్ గా మారింది.
పోలీసుల దర్యాప్తులో దర్శకుడు క్రిష్ పేరు బయటకు రావడంతో ఆయనని కూడా పోలీసు వారు విచారణకు పిలిచారు. అయితే పోలీసులు పిలిచినప్పుడు క్రిష్ ఆఫ్ స్టేషన్ లో ఉండడంతో విచారణకు రాలేకపోయారట. ఇక ఈరోజు గచ్చిబౌలి పోలీసుల ముందు క్రిష్ హాజరు అయ్యో అవకాశం ఉంది. కాగా ఆరోజు రాడిసన్ హోటల్ లో జరిగిన పార్టీకి తాను వెళ్లినట్లు క్రిష్ ఇప్పటికే ఒప్పుకున్నారు. కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని.. అక్కడ తన ఫ్రెండ్ ని కలిసి వచ్చానని వెల్లడించారు.
మరి ఆయన డ్రగ్స్ తీసుకున్నారా..? లేదా..? అసలు ఏం జరిగింది అనే దాని పైన పూర్తి వివరాలు తెలియాలి అంటే పోలీస్ విచారణ ముగిసే వరకు వేచి చూడాలి. ఇక ఈ కేసులో మరికొంతమంది కొత్త పేర్లని కూడా చేర్చి పోలీసులు విచారణని కొనసాగిస్తూ వస్తున్నారు.
Also Read: Dil Raju: పాలిటిక్స్ లోకి రాబోతున్న దిల్ రాజు.. నిజమెంత?
Also Read: FD Interest Rates: ఎఫ్డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి