Mahashivratri 2024: మహాశివరాత్రి పర్వదినాన పవిత్రమైన యోగం.. ఈ 4 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

Lord Shiva: హిందూ మతంలో మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ మరో వారం రోజుల్లో రాబోతుంది. ఇదే రోజున ఓ పవిత్రమైన యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2024, 02:45 PM IST
Mahashivratri 2024: మహాశివరాత్రి పర్వదినాన పవిత్రమైన యోగం.. ఈ 4 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

Mahashivratri 2024 Effect on Zodiac Signs: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. శివపార్వతుల పెళ్లి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈరోజున పార్వతీపరమేశ్వరులను పూజించడంవల్ల మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినం మార్చి 08న జరుపుకోనున్నారు. ఈ పవిత్రదినాన కుంభరాశిలో సూర్యుడు, శని మరియు శుక్రుడు కలయిక కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం 5 రాశులవారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆ రాశలు ఏవో తెలుసుకుందాం. 

తులరాశి
శివుడు అనుగ్రహంతో తులరాశి వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. బిజినెస్ లో పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆగిపోయిన ప్రమోషన్ వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. 
మకరరాశి 
మహాశివరాత్రి రోజున మకరరాశి వారికి శివుడి కటాక్షం లభిస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక ఫలిస్తుంది. మీ సమస్యలన్నీ దూరమవుతాయి. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
మేష రాశి
మహాశివరాత్రి రోజు మేషరాశి వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతున్నారు. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 
వృషభ రాశి
వృషభ రాశి వారికి మహాశివరాత్రి రోజున మంచి ఫలితాలను పొందుతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు.
(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Lord Shiva Photo Vastu: ఇంట్లో శివపార్వతుల  ఫోటో ఏ దిక్కున పెట్టాలి? వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది?

Also Read: Money On Roadside: రోడ్డుపై డబ్బు దొరికిందా? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News