Red Chillies Adulterated Goes Viral: ఒకప్పుడు కొన్ని పదార్థాలు మాత్రమే కల్తీకి గురౌతుండేవని చెప్పుకునే వాళ్లం. కానీ ఇప్పుడు కల్తీకి గురికానిది ఏదుందబ్బా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలు, పెరుగు, పచ్చళ్లు, నూనెలు, ఆవాలు, జీలకర్ర ఇలా ప్రతిదీ మార్కెట్ లలో కల్తీ అయిపోతున్నాయి. ఇక.. బియ్యం, పప్పు, వంటలలో ఉపయోగించేవి కల్తీలకు గురౌతున్నాయి. ఇక మెడికల్ వస్తువులు, ట్యాబ్లెట్ లు ఇలా చెప్పుకుంటూ పోతే అస్సలు మనం ఏంతింటున్నామో అని చాలా భయమేస్తుంటుంది. ఒకప్పుడు పంటలు వేసినప్పుడు ఎలాంటి ఆర్టిఫిషియల్ రసాయనాలు ఉపయోగించే వారు కాదు. కానీ ఇప్పుడు ప్రతీది ఆర్టిఫిషియల్. ఏది సాంప్రదాయ పద్ధతి ప్రకారం దొరకడం లేదు.
ఆఖరికి ఎండుమిర్చి కి కూడా రంగులు వేస్తున్నారు కల్తీకి కాదేది అనర్హత అన్నట్టుగా చివరకు మిరపకాయలను కూడా వదలట్లేదు 🤦♂️ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. pic.twitter.com/5cgdDkyODe
— YASIN YASIN (@itsmeeYasin) March 2, 2024
పండ్లు కూడా కొన్నిరకాల రసాయనాలను ఉపయోగించి పండేలా చేస్తున్నారు. ఇలాకెమికల్స్ కలిపిన వాటిని తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులకు గురౌతున్నారు. పోలీసులు ఎంత జాగ్రత్తలు తీసుకున్న, ఎన్నిదాడులు చేసిన కూడా కల్తీ దారులు.. మాత్రం తమ పద్ధతులు మార్చుకోవడంలేదు. తాజగా, ఎర్రటి ఘాటు మిర్చిలను కొందరు మహిళలు రసాయలను కలిపిన ఎర్రటి నీటిలో ముంచి బైటకు తీసి పక్కన వేస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలలో నిలిచింది. కొందరు మహిళలు ఎర్రటి మిరపకాయలను కల్తీ చేస్తున్న ఘటన కొందరు యువకులు తెలిసింది. వెంటనే అక్కడిక చేరుకుని కల్తీ చేస్తున్న ప్రదేశాన్ని, మహిళలను కొందరు తమ ఫోన్ లలో రికార్డు చేశారు. దీంతో అక్కడున్న మహిళలు వీడియోతీయోద్దని వాగ్వాదానికి దిగడం ఈ వీడియోలో కన్పిస్తుంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంకా కల్తీ కానిదేముంది అంటూ సెటైరిక్ గా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది.
Read More: Rashmika: చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook